భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తన బ్రాండ్ నుంచి, కొత్తగా అప్‌డేట్ చేసిన 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు బైకులు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఇప్పటికే అప్‌డేట్ చేయబడ్డాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ బైక్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ తన ఆర్ 1250 జిఎస్‌ను రూ. 20.45 లక్షలకు విడుదల చేయగా, ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్‌ను రూ. 22.40 లక్షల ధరకు మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్‌ను ఇంతకు ముందు రూ. 20.45 లక్షలకు విక్రయించబడేది.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

ప్రస్తుతం ఈ బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్ బైక్ ధర మునుపటికంటే రూ. 5 వేలు పెరిగింది. కంపెనీ త్వరలో '40 ఇయర్ జిఎస్ 'వెర్షన్ కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ యొక్క జిఎస్ లైనప్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఈ బైక్ ప్రవేశపెట్టనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

భారతదేశంలో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బైక్ హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా మరియు త్వరలో ప్రారంభించబోయే డుకాటీ మల్టీస్ట్రాడా వి 4 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్, మునుపటిలాగా ఆర్ 1250 జిఎమ్ ప్రో మరియు ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

ఈ రెండు బైకులలో, అడ్వెంచర్ ప్రో కొత్త మరియు కఠినమైన రోడ్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. దీనికి కారణం తగినంత క్రాష్ ప్రొటక్షన్, లార్జ్ లగేజ్ మౌంట్, లాంగ్ విండ్‌స్క్రీన్ మరియు మోర్ సస్పెన్షన్ ట్రావెల్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

ఈ బైకులలోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎబిఎస్ ప్రో మోడ్, ఎకో రైడింగ్ మోడ్, హిల్ స్టార్ట్ కంట్రోల్ ప్రో మరియు డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్‌ వంటివి ఉంటాయి. ఇవన్నీ మునుపటి రైడింగ్ ఎయిడ్స్ సెట్ కంటే అధునాతనమైనవి. ఈ బైక్‌లను కంపెనీ కొత్త కలర్ ఆప్షన్స్ స్టైల్ ట్రిపుల్ బ్లాక్ మరియు స్టైల్ ర్యాలీలో అందిస్తున్నారు.

భారత్‌లో విడుదలైన BMW R 1250 GS & R 1250 GS అడ్వెంచర్ బైక్స్; ధర & వివరాలు

బీఎండబ్ల్యూ జిఎస్ అడ్వెంచర్ యొక్క సీటు ఎత్తు 890 మిమీ వద్ద మరియు ఆర్ 1250 జిఎస్ యొక్క సీటు ఎత్తు 850 మిమీ వద్ద ఉంచబడింది. ఫ్యూయెల్ ట్యాంక్ విషయానికి వస్తే, జిఎస్ అడ్వెంచర్‌కు 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ లభించగా, ఆర్ 1250 జిఎస్‌కు 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 8, 2021, 18:48 [IST]
English summary
BMW R 1250 GS And BMW R 1250 GS Adventure Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+