భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

భారతీయ మార్కెట్లో Triumph Motorcycles (ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్) కంపెనీ తన 2021 Triumph Speed ​​Twin (2021 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2021 Triumph Speed ​​Twin బైక్ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

కొత్త 2021 Triumph Speed ​​Twin బైక్ కొత్త బ్రేక్‌లు, సస్పెన్షన్ సెటప్, టైర్లు మరియు అల్లాయ్ వీల్స్‌తో విడుదలచేయబడింది. అంతే కాకుండా ఇందులోని ఇంజిన్ కూడా అప్డేటెడ్ చేయబడింది. ఈ కొత్త బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

Triumph Speed ​​Twin మంచి పర్ఫామెన్స్ అందించేవిధంగా తయారుచేయబడింది. ఇందులో స్పెసిఫికేషన్, హ్యాండ్లింగ్ మరియు రైడ్ నాణ్యతను మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్ అధిక పనితీరు కలిగిన 1200 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది Triumph Bonneville (ట్రయంఫ్ బోన్‌విల్లే) నుండి తీసుకోబడింది. కానీ ట్రయంఫ్ బోన్‌విల్లే కంటే కూడా మెరుగైన పనితీరుని అందిస్తుంది. కానీ ఈ కొత్త Triumph Speed ​​Twin యొక్క డిజైన్ మరియు స్టైలింగ్ మాత్రం అలాగే ఉండటం గమనించవచ్చు.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

కొత్త 2021 Triumph Speed ​​Twin యొక్క పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే,ఇందులోని ఇంజిన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 96 బిహెచ్‌పి పవర్ మరియు 4,950 ఆర్‌పిఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ బోనెవిల్లే కంటే 17 శాతం ఎక్కువ శక్తిని అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

ఈ కొత్త బైక్ లోని సస్పెన్షన్‌ సెటప్ లో కొంత మార్పులు చేయబడ్డాయి. ఈ బైక్ ముందు భాగంలో 43 మిమీ మార్జోచి ఫోర్క్‌లను 120 మిమీ ప్రయాణంతో ఉపయోగిస్తుంది. అదే సమయంలో, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు 120 మిమీ ట్రావెల్‌తో బైక్ యొక్క వెనుక భాగంలో అమర్చబడి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

Triumph Speed ​​Twin బైక్ యొక్క్ బ్రేకిన్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో బ్రెంబో డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించింది. బైక్ ముందు చక్రం నాలుగు పిస్టన్ M50 రేడియల్ మోనోబ్లాక్ కాలిపర్ డ్యూయల్ 305 మిమీ డిస్క్ బ్రేక్‌ను ఉపయోగిస్తుంది, వెనుక చక్రం రెండు పిస్టన్ కాలిపర్ 220 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్‌ని ఉపయోగిస్తుంది. కావున అద్భుతమైన బ్రేకింగ్ పొందవచ్చు.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

ఈ కొత్త బైక్ కి బోన్‌విల్లే బ్యాడ్జ్‌తో లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ ఇవ్వబడింది. బైక్‌లో ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు రైడింగ్ మోడ్, క్లాక్, ట్రిప్ మీటర్ మరియు రోడ్ మీటర్‌తో సహా చాలా సమాచారాన్ని అందించే రెండు చిన్న డిజిటల్ ఎల్‌సిడి స్క్రీన్‌లు లభిస్తాయి.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

ఈ కొత్త బైక్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ ఇండికేటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బైక్‌లో ఇచ్చిన రైడింగ్ మోడ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బైక్ మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి రెయిన్, రోడ్ మరియు స్పోర్ట్ మోడ్స్.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

ఈ బైక్ లో రైడర్ యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా త్రాటల్ రెస్పాన్స్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లు రెండింటినీ సర్దుబాటు చేస్తుంది. బైక్ నడుపుతున్నప్పుడు రైడింగ్ మోడ్ మార్చవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్‌ను పూర్తిగా ఆఫ్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. ఈ బైక్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Speed Twin; ధర రూ. 10.99 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Triumph Speed ​​Twin బైక్ కంప్లీట్ బిల్డ్ యూనిట్ మార్గం ద్వారా దిగుమతి చేసుకోబడుతుంది. కంపెనీ దేశీయ మార్కెట్లో ఆశించిన అమ్మకాలను పొందలేదు, కానీ ఈ కొత్త బైక్ విడుదలతో అమ్మకాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుస్తుంది. 2021 Triumph Speed ​​Twin బైక్ Ducati Scrambler 1100 మరియు Harley Davidson Forty Eight వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 31, 2021, 19:23 [IST]
English summary
2021 triumph speed twin launched in india new updates price engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+