త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టీవీఎస్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రసిద్ధ అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌ను భారతమార్కెట్లో అప్‌డేట్ చేసి విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. అయితే కంపెనీ ఇప్పుడు తన అపాచీ ఆర్ఆర్ 310 బైక్ యొక్క టీజర్‌ను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టివిఎస్

టీవీఎస్ కంపెనీ త కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్ యొక్క టీజర్ విడుదల చేసినప్పటికీ, దాని అధికారిక విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ కొత్త టీవీఎస్ బైక్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ ఇక్కడ గమనించవచ్చు. ఈ బైక్ ఇప్పుడు కొన్ని కొత్త అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉండటంతో పాటు, కొత్త కలర్ ఆప్షన్స్ కలిగి కూడా కలిగి ఉంటుంది.

త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టివిఎస్

ఈ అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌లో అదే 312 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 33.5 బిహెచ్‌పి శక్తి మరియు 27.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టివిఎస్

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 లో టీవీఎస్ స్మార్ట్ టెక్నాలజీ, త్రాటల్-బై-వైర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అంతే కాకుండా ఈ అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌లో 5 ఇంచెస్ టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంది. ఈ బైక్ మిచెలిన్ రోడ్ 5 టైర్లతో వస్తుంది.

త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టివిఎస్

అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి రెయిన్, అర్బన్, స్పోర్ట్ మరియు ట్రాక్ మోడ్లు. ఈ బైక్ కేవలం 2.93 సెకన్లలో గంటకు 60 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఇది గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి 7.17 సెకన్ల సమయం పడుతుంది.

త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టివిఎస్

ఈ కొత్త బైక్ మునుపటి బైక్ కంటే అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్టీ-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్‌ఈడీ ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఆర్టీ-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నాయి. 2021 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, ముందు వైపున యుఎస్డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉన్నాయి.

త్వరలో విడుదల కానున్న అపాచీ ఆర్ఆర్ 310 టీజర్ రిలీజ్ చేసిన టివిఎస్

ఈ కొత్త అపాచీ ఆర్ఆర్ 310 లో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, దీని ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ వస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత కెటిఎం ఆర్‌సి 390, యమహా ఆర్ 3, కవాసకి నింజా 400 వంటి బైక్‌లకు అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 6, 2021, 14:41 [IST]
English summary
2021 TVS Apache RR 310 Teased. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+