భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

TVS Motor కంపెనీ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో కొత్త 2021 Apache RR310 ని విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 2.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త మోటార్‌సైకిల్ బ్రాండ్ అందించే బిల్డ్-టు-ఆర్డర్ ప్రక్రియ ద్వారా అనేక అప్డేట్స్ మరియు పర్సనలైజేషన్ అప్సన్స్ కలిగి ఉంది. భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ గురించి పూర్త సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

2021 Apache RR310 బైకులు పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించబడతాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ నెలలో 100 యూనిట్లు మరియు అక్టోబర్ నెలలో 150 యూనిట్లకు పరిమితం చేయబడతాయని కంపెనీ ప్రకటించింది. బుకింగ్ మొత్తం కాన్ఫిగరేషన్ ఖర్చుతో సమానంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

కొత్త 2021 Apache RR310 రెండు పర్ఫామెన్స్ కిట్స్ కలిగి ఉంటుంది.

1) డైనమిక్ కిట్

2) రేస్ కిట్.

డైనమిక్ కిట్ ధర రూ. 12,000, ఇందులో ఫుల్లీ అడ్జస్టబుల్ కెవైబి ఫ్రంట్ ఫోర్క్, ఫుల్లీ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్ మరియు యాంటీ రస్ట్ బ్రాస్ కోటెడ్ డ్రైవ్ చైన్ ఉంటాయి.

ఇందులోని ఫ్రంట్ ఫోర్క్ 20 మిమీ రీబౌండ్ మరియు 15 మిమీ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కంప్రెషన్ డంపింగ్ కలిగి ఉంది. అదేవిధంగా రియర్ మోనో-షాక్ విషయానికొస్తే, ఇది 20-స్టెప్ రీబౌండ్ డంపింగ్ మరియు 15-స్టెప్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కలిగి ఉంది. చివరగా, యాంటీ-రస్ట్ బ్రాస్ కోటెడ్ డ్రైవ్ చైన్ దీర్ఘకాలం ఉంటుంది మరియు మోటార్‌సైకిల్ రూపాన్ని మరింత మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

ఇక రేస్ కిట్ ధర రూ. 5000 వరకు ఉంటుంది. ఇందులో రేస్ ఎర్గో హ్యాండిల్‌బార్, పెరిగిన ఫుట్‌రెస్ట్ అసెంబ్లీ మరియు Knurled footpegs (నర్ల్ ఫుట్‌పెగ్స్) వున్నాయి.

కంపెనీ ఇప్పుడు రేస్ కిట్ అప్‌గ్రేడ్‌తో, బైక్ 4.5-డిగ్రీ హయ్యర్ లీన్ యాంగిల్‌తో వస్తుంది. కావున రైడర్ యొక్క పట్టు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండేలా చూస్తుంది. ఈ కారణంగా బైక్ అంచులలో వేగంగా నడపడానికి కూడా అనుమతిస్తుంది. ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర అప్‌డేట్స్ విషయానికి వస్తే, ఇందులో రేస్ మఫ్లర్ ఇన్‌స్టాల్ చేయబడింది, ఇది మొదటి నుండి కొద్దిగా పెంచబడింది, తద్వారా లీన్ యాంగిల్స్ పైకి మరియు రేస్ ఎగ్జాస్ట్ నోట్ ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొన్ని అప్‌గ్రేడ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో స్టోరేజ్ ఆఫ్ డిజిటల్ డాక్యుమెంట్ ఉంటుంది, అంతే కాకుండా డైనమిక్ రేవ్ లిమిట్ ఇండికేటర్, డే ట్రిప్ మీటర్ మరియు ఓవర్ స్పీడ్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి. రెవ్ లిమిటర్ యొక్క రంగు నీలి నుండి ఎరుపు వరకు పరిమితికి దగ్గరగా మారుతుంది. రెవ్ లిమిటర్ యొక్క కలర్ బ్లూ నుండి రెడ్ కలర్ వరకు పరిమితికి దగ్గరగా మారుతుంది.

కొత్త 2021 Apache RR310 మోటార్‌సైకిల్ మెరుగైన భద్రత కోసం వేవ్ కీతో అందించబడుతుంది. దీనిని సస్పెన్షన్ డంపింగ్ అడ్జస్ట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

2021 Apache RR310 లో అతిపెద్ద మార్పు TVS ARIVE అప్లికేషన్ లేదా వెబ్ కాన్ఫిగరేటర్ ఉపయోగించి బ్రాండ్ యొక్క కొత్త బిల్ట్-టు-ఆర్డర్ కాన్ఫిగరేషన్. ప్రొడక్షన్ నుండి డెలివరీ ప్రక్రియ వరకు అనేక దశల్లో ఈ ప్రోగ్రామ్ 'లైవ్ ఆర్డర్ ట్రాకింగ్' ను కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

2017 సంవత్సరం నుండి మొదటి తరం అపాచీ యొక్క పాత కస్టమర్లు తమ మోటార్‌సైకిల్‌ని ఈ క్రింది ఉపకరణాలతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కూడా కంపెనీ ప్రకటించింది. ఇందులో రేస్ హ్యాండిల్‌బార్, రేస్ ఫుట్‌పెగ్స్ మరియు రేస్ ఫుట్‌రెస్ట్ ఉన్నాయి. ఇవి రైడర్లకు అలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా బిఎస్ 6 అపాచీ కస్టమర్లు తమ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కొత్త మోడల్‌లో విడుదల చేసిన అన్ని అప్‌గ్రేడ్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

ఈ కొత్త బైక్ లో పైన పేర్కొన్న అప్‌గ్రేడ్‌లు కాకుండా, ఇతర మార్పులు జరగలేదు, కావున బైక్ దాదాపు అలాగే ఉంటుంది. కొత్త మోటార్‌సైకిల్ 5 ఇంచెస్ TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ని కలిగి ఉంటుంది. దీనితో పాటుమల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, త్రాటల్-బై-వైర్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు గ్లైడ్ త్రూ టెక్నాలజీ ప్లస్ కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

2021 Apache RR310 బైక్ 312 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Apache RR310; ధర & వివరాలు

Apache RR310 యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో USD ఫోర్క్‌లు మరియు వెనుకవైపు మోనో-షాక్ సెటప్ ఉంటాయి. అదేవిధంగా ఇది మంచి బ్రేకింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది, కావున ఈ బైక్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. దీనితోపాటు డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా లభిస్తుంది. మొత్తానికి ఈ బైక్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తాయి.

Most Read Articles

English summary
2021 tvs apache rr310 launched price 2 59 lakh suspension performance kits customization details
Story first published: Monday, August 30, 2021, 20:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X