హోండా మంకీ 125 సిసి బైక్; ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా, తన రెట్రో స్టైల్ 2022 మంకీ మినీ-బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మంకీ మినీ-బైక్ ఇంజిన్ మరియు డిజైన్‌లో కొన్ని కొత్త అప్డేట్స్ కలిగి ఉంది. ఇది చూడటానికి దాదాపు చాలా డిఫరెంట్ గా మరియు చాలా ఆకర్షణీయంగా కూడా ఉంది.

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

హోండా మోటార్ సైకిల్ కంపెనీ తన మంకీ మినీ బైక్ మొదటసారిగా 1960 లో ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు ఈ మోడ్రన్ మంకీ మినీ బైక్ కొత్త 124 సిసి ఇంజిన్‌తో వస్తుంది. కొత్త మంకీ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ ని తలపించినప్పటికీ, దీనికి కొత్త కలర్ ఆప్షన్స్ మరియు కొన్ని చిన్న మార్పులను ఇక్కడ గమనించవచ్చు.

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ కొత్త బైక్ వాహనదారులకు అనుకూలంగా ఉండటానికి, మరియు కస్టమైజ్ చేసుకోవడానికి యాక్ససరీస్ కూడా అందించబడ్డాయి. ఈ కొత్త బైక్ యువ రైడర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది. ఈ బైక్ వాహనదారులకు మంచి రైడింగ్ అనుభవాన్ని అందించేవిధంగా అప్డేట్ చేయబడింది.

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

హోండా మంకీ మినీ బైక్ ఫుల్లీ ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది మరియు బటన్ నొక్కినప్పుడు వెలిగించే పుష్ బటన్‌ కూడా ఇందులో ఉంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు దాదాపు 107 కిలోల నుండి 104 కిలోలకు తగ్గిచబడింది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ బైక్ యొక్క ఎలక్ట్రానిక్స్ లో ఎటువంటి మార్పు చేయలేదు

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ కొత్త హోండా మంకీ బైక్ లో అదే ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. దీనికి ఐఎంయు యూనిట్ కూడా ఉంది. ఈ బైక్ 1,145 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క సీట్ ఎత్తు 775 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్‌లో బ్లాక్ పాటర్న్ టైర్లు ఉన్నాయి.

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

ఈ మినీ బైక్‌లో 124 సిసి ఎస్‌ఓహెచ్‌సి ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 9.4 బిహెచ్‌పి శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 91 కిమీ. ఇది 67 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంది.

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

కొత్త హోండా మంకీ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, ఇది యుఎస్డి ఫోర్క్‌లతో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, ప్రీమియం అల్యూమినియం ఫినిష్‌తో 100 మిమీ స్టాండర్డ్ మరియు వెనుక భాగంలో టు టైప్స్ రివైజ్డ్ డంపర్ రబ్బర్‌లను కలిగి ఉంది. అదేవిధంగా ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక వైపు 190 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది.

హోండా మంకీ 125 సిసి బైక్; సూపర్ డిజైన్ & సూపర్ పర్ఫామెన్స్

కొత్త హోండా మంకీ బైక్ 1970 లలో ఒక బాగా ప్రాహుర్యం పొందిన బైక్, ఇది ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ తో త్వరలో యూరోపియన్ మార్కెట్లో విడుదల కానుంది. కానీ ఈ బైక్‌ను కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం లేదు.

Most Read Articles

English summary
2022 Honda Monkey 125cc Debuts With New Engine. Read in Telugu.
Story first published: Tuesday, June 22, 2021, 17:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X