కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా, తన కొత్త సూపర్ కబ్ 125 మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ 2022 హోండా సూపర్ కబ్ 125 చూడటానికి చాలా కొత్తగా ఉండటమే కాకుండా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను అందుకుంటుంది.

కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కొత్త హోండా సూపర్ కబ్ 125 అప్డేట్ చేయబడింది. 2022 హోండా సూపర్ కబ్ 125 లో సింగిల్ ఓవర్ హెడ్ కామ్, టూ-వాల్వ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 బిహెచ్‌పి శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

ఈ కొత్త సూపర్ కబ్ 125 స్మార్ట్ కీ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది వాహనాన్ని పెద్ద పార్కింగ్ స్థలంలో గుర్తించడంలో సహాయపడుతుంది. హోండా కంపెనీ తన సూపర్ కబ్ 125 ను మొట్టమొదట 1958 లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ మోటార్ సైకిల్ హోండా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా ఉంది.

కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

సూపర్ కబ్ 125 స్కూటర్ 2017 లో 100 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత సూపర్ కబ్‌లో అదే క్లాసిక్ స్టైల్ మరియు బేసిక్ మెకానికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో చేర్చడం జరిగింది. ఈ స్కూటర్ ఇతర దేశాల్లో అమ్మకాన్ని ఉంది కానీ, భారతీయ మార్కెట్లో ఎప్పుడూ అమ్మకానికి రాలేదు.

కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

హోండా కబ్ ఆధారంగా హీరో హోండా స్ట్రీట్ అని పిలువబడే హీరో క్లచ్ లేకుండా స్టెప్-త్రూ మోడల్ ప్రవేశపెట్టబడింది. అయితే ఆ మోడల్ భారతదేశంలో పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత భారతదేశంలో బజాజ్ ఆటో 1980 లలో హోండా కబ్ లాంటి ఎమ్-50 అని పిలువబడే స్టెప్-త్రూ ప్రవేశపెట్టింది.

కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

ఈ మోటార్ సైకిల్ మాత్రం టెక్నాలజీ పరంగా బజాజ్ ఎమ్-50 హోండా కబ్ మీద ఆధారపడలేదు. ఇది టూ-స్ట్రోక్ ఇంజిన్‌తో విడుదల చేయబడింది. కొన్ని సంవత్సరాల తరువాత, బజాజ్ 80 సిసి ఇంజిన్‌తో ఎమ్-80 విడుదల చేయబడింది. ఆ తర్వాత కాలక్రమేణా ఇది గ్రామీణ ప్రాంతాల్లో అనుకూలమైన ఒక ద్విచక్ర వాహనంగా స్థిరపడింది.

కొత్త సూపర్ కబ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన హోండా మోటార్‌సైకిల్; వివరాలు

బజాజ్ ఎమ్ 80 బైక్ తక్కువ నిర్వహణ మరియు మంచి మైలేజ్ ఇవ్వడం చేత ఇది 1980 లలోనే బాగా అమ్ముడైంది. అయితే ఈ 2022 హోండా సూపర్ కబ్ 125 మోపెడ్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం లేదు. కానీ ఇది త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
2022 Honda Super Cub 125 Unveiled. Read in Telugu.
Story first published: Tuesday, June 22, 2021, 15:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X