దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

జపాన్‌కి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) భారత మార్కెట్లో మరో కొత్త ప్రీమయం మోటార్‌సైకిల్ '2022 కవాసకి నింజా జెడ్ఆర్-10ఆర్' (2022 Kawasaki Ninja ZX-10R) సూపర్ బైక్‌ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2022 Kawasaki Ninja ZX-10R ధర రూ. 15.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 కవాసకి నింజా జెడ్ఆర్-10ఆర్ (2022 Kawasaki Ninja ZX-10R) సూపర్ బైక్‌ దాని మునుపటి 2021 మోడల్ కంటే కూడా రూ.15,000 ఎక్కువ ఖరీదైనది. ఈ కొత్త సూపర్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి లైమ్ గ్రీన్ కలర్ కాగా, మరొకటి మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్. ఈ రెండు కలర్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

కంపెనీ అందించిన సమాహారం ప్రకారం, కొత్త 2022 కవాసకి నింజా ZX-10R సూపర్ బైక్ యొక్క డెలివరీలు వచ్చే రానున్న కొత్త సంవత్సరం 2022 జనవరి నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఆసక్తి గల కొనుగోలుదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

కొత్త 2022 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఆధునిక ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 998 సిసి ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఈ ఇంజిన్ 200 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది. అంతే కాకుండా, ఈ బైక్ యొక్క ఇంజిన్‌లో DOHC సెటప్, 16 వాల్వ్‌లు, ఎలక్ట్రానిక్ త్రాటల్ వాల్వ్ ఉపయోగించబడింది. కావున ఈ ఇంజన్ 114.9 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

కంపెనీ ఈ కొత్త బైక్ లో ఆధునిక కాస్మెటిక్ అప్డేట్స్ కూడా చేసింది. ఇది ఏరోడైనమిక్ డిజైన్‌ను పొందుతుంది, ఎగువ కౌల్‌లో ఇంటిగ్రేటెడ్ వింగ్‌లెట్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, ఓహ్లిన్స్ స్టీరింగ్ డంపర్ మరియు బ్రెంబో బ్రేక్‌లు ఇందులో ఉపయోగించబడ్డాయి.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

కొత్త 2022 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా పొందుతుంది. ఈ బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, పవర్ మోడ్, రైడింగ్ మోడ్ మరియు ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది, కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. మొత్తానికి ఈ బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ తో వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

ఇదిలా ఉండగా కవాసకి కంపెనీ గత నవంబర్ నెలలో కొత్త కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ బైక్ దేశీయ విఫణిలో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో నింజా 1000ఎస్ఎక్స్ ధర రూ. 11.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్ లు కూడా ప్రారంభించబడ్డాయి. అయితే దీని డెలివరీలు డిసెంబర్ నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

కొత్త కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ సూపర్‌బైక్‌ను కంపెనీ రెండు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. ఇందులో ఒకటి ఎమరాల్డ్ బ్లాస్ట్ గ్రీన్, మరొకటి మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే. ఈ రెండు కలర్ వేరియంట్ల ధరలు ఒకేలా ఉంటాయి. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

కొత్త 2022 కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ బైక్‌లో అదే మునుపటి ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. అలాగే, ఇప్పుడు ఇది కొత్త 4.3 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అప్లికేషన్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో రైడర్ వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, ఈ టిఎఫ్‌టి స్క్రీన్ గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంధన స్థాయి, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలెర్ట్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని రైడర్ కు తెలియజేస్తుంది.

దేశీయ మార్కెట్లో 2022 Kawasaki Ninja ZX-10R విడుదల: ధర & వివరాలు

2022 కవాసకి నింజా 1000ఎస్ఎక్స్ బైక్‌ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1,043 సిసి, ఇన్‌లైన్ 4 సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 140 బిహెచ్‌పి పవర్ ను మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 111 ఎన్ఎమ్ టార్క్‌ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 4, 2021, 9:59 [IST]
English summary
2022 kawasaki ninja zx 10r supersport bike launched price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+