మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి తన 2022 వల్కన్ ఎస్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2022 కవాసకి వల్కన్ ఎస్ బైక్‌ రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి మాట్టే గ్రాఫైట్ గ్రే మరియు మెటాలిక్ మాట్టే గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్స్.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

ఈ కొత్త బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది గ్రే కలర్ షేడ్‌లతో అనుసంధానించబడి, ట్యాంక్ మరియు రిమ్ టేపులలో గ్రీన్ కలర్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. మరొకటి పెర్ల్ రోబోటిక్ వైట్. రేడియేటర్ గార్డ్ మరియు ఇంధన ట్యాంక్ గ్రాఫిక్స్ లో బ్లూ గ్రేడియంట్ ఉంటుంది. ఈ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ ఎస్ గ్రాఫిక్స్ తో వస్తుంది.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

ఈ బైక్ లో గుర్తించదగిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇందులో కొత్త కలర్స్ ప్రవేశపెట్టడం తప్ప ఇతర మార్పులు చేయలేదు. ఇది దాదాపు భారతదేశంలో విక్రయించిన మోడల్ మాదిరిగానే ఉంది. కానీ చూటడానికి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

కవాసకి వల్కన్ ఎస్ బైక్ 649 సిసి ప్యారలల్ లిక్విడ్ ట్విన్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 60 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 62.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

కొత్త వల్కన్ బైక్ కవాసకి జెడ్ 650 మరియు నింజా 650 వంటి వాటిలోని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. కానీ కొత్త బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో ఇన్స్ట్రూమెంట్ కన్సోల్ ఫీచర్ అందించబడలేదు. ఇందులో రెట్రో డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇది ఒక బ్లాక్ కౌల్, రెండు వైపులా రౌండ్ షేప్ ఫెండర్లు మరియు వెనుక వైపు సెట్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

కొత్త కవాసకి వల్కన్ ఎస్ బైక్‌లో 1575 మిమీ పొడవు గల వీల్‌బేస్ ఉంది. ఈ బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే దీని ముందుభాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు 130 మిమీ ప్రీ-లోడ్ ఆఫ్-సెట్ మోనో-షాక్ సెటప్‌ను కలిగి ఉంది.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

కొత్త కవాసకి వల్కాన్ ఎస్ బైక్‌ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, దీని ముందుభాగంలో డ్యూయల్ 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు సింగిల్ 250 మిమీ యూనిట్ తో అందించబడుతుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను స్టాండర్డ్ గా కలిగి ఉంది.

మీకు తెలుసా.. 2022 కవాసకి వల్కన్ ఎస్ ఇక కొత్త కలర్ ఆప్సన్స్‌లో కూడా

కవాసకి వల్కన్ ఎస్ బైక్‌లో 14 లీటర్ ఫార్వర్డ్ ఫ్యూయల్ ట్యాంక్, అప్-రైట్ హ్యాండిల్ బార్ మరియు ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. కవాసకి వల్కన్ ఎస్ బైక్ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్ బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, June 13, 2021, 8:45 [IST]
English summary
2022 Kawasaki Vulcan S Revealed With New Colours. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+