భారత్‌లో అడుగుపెట్టిన 2022 Moto Guzzi V85 TT; ధర, ఫీచర్స్ & వివరాలు

ఇటీవల భారతీయ మార్కెట్లో అనేక కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు బైక్ తయారీదారు అయిన Moto Guzzi India (మోటో గజ్జి ఇండియా) కొత్త బైక్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2022 Moto Guzzi V85 TT ధర రూ. 15.40 లక్షలు(ఎక్స్-షోరూమ్).

కొత్త Moto Guzzi V85 TT బైక్ మంచి కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కలర్స్ కూడా మీరు ఈ ఆర్టికల్ లో గమనించవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, చాలా స్టైలిష్ గా ఉండి వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండేవిధంగా తయారుచేయబడింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 Moto Guzzi V85 TT బైక్ ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ మోడల్. మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా 'జియల్లో మొజావే (ఎల్లో విత్ వైట్) మరియు రోసో ఉలూరు (వైట్ విత్ రెడ్)' కలర్ ఆప్షన్‌లను పొందుతుంది. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

2022 Moto Guzzi V85 TT బైక్ రెడ్ కలర్ ఫ్రేమ్, డ్యూయల్ టోన్ కాంపోనెంట్‌లు మరియు డబుల్ స్టిచ్డ్ బోర్డర్‌తో స్కై స్వెడ్ ఎఫెక్ట్ సాడిల్ పొందుతుంది. ఇవన్నీ కూడా బైక్ యొక్క దూకుడు రూపాన్ని పెంచడంలో సహాయపడతాయి.

Moto Guzzi V85 TT బైక్ లో మోటో గుజ్జి లోగో కూడా బ్లాక్ కలర్ రిమ్స్‌తో ఇవ్వబడింది. Moto Guzzi V85 TT రివైజ్డ్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇందులో రైడ్-బై-వైర్ త్రాటల్ మరియు కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను ఉంటుంది. ఇవన్నీ వాహనదారునికి వహ్హణం గురించిన సమాచారాన్ని అందిస్తుంది.

ఈ కొత్త బైక్ లో ఇవి మాత్రమే కాకుండా, మోటో గుజ్జి V85 TT లో మాండెలో ఈగిల్ DRL లు, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, హ్యాండ్ గార్డ్స్, అల్యూమినియం ఆయిల్ సంప్ గార్డ్ మరియు ఫోర్క్ స్టాన్చియన్ గార్డ్‌తో ఫుల్లీ ఎల్ఈడీ డబుల్ హెడ్‌లైట్ యూనిట్‌ వంటివి కూడా పొందవచ్చు.

కొత్త Moto Guzzi V85 TT బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 853 సిసి ఎయిర్-కూల్డ్, 90-డిగ్రీ V- ట్విన్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 82 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కంపెనీ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించింది.

కొత్త Moto Guzzi V85 TT మోటార్‌సైకిల్‌లో మొత్తం 5 రైడింగ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ బైక్ లో రెండు అదనంగా చేర్చబడ్డాయి. ఇందులో రోడ్, రెయిన్, ఆఫ్-రోడ్, స్పోర్ట్ మరియు కస్టమ్ మోడ్స్ అనే మొత్తం 5 రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.

2022 Moto Guzzi V85 TT బరువు 230 కేజీల వరకు ఉంటుంది. ఈ కొత్త బైక్ 23 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముంద్దు భాగంలో 41 మిమీ యుఎస్‌డి ఫోర్క్‌లను మరియు వెనుక మోనోషాక్ సస్పెన్షన్‌ ఉంటుంది.

కొత్త బైక్ లో కంపెనీ 19 ఇంచెస్ ఫ్రంట్ క్రాస్-స్పోక్ వీల్ మరియు 17 ఇంచెస్ రియర్ స్పోక్ వీల్‌ను ఉపయోగించింది. మోటార్‌సైకిల్‌కు ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు. కావున ఈ బైక్ ఎటువంటి రహదారిలో అయినా మంచి పట్టును కలిగి ఉంటాయి. ఇది రైడర్ కి రైడింగ్ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 Moto Guzzi V85 TT బైక్ అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 4-పిస్టన్ బ్రెంబో రేడియల్ కాలిపర్‌లతో ట్విన్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భగంలో 2-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌లతో 260 మిమీ రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనితో పాటు ఇది డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌ని కూడా పొందుతుంది. మొత్తానికి ఈ బైక్ అధునాతన ఫీచర్స్ పరికరాలతో నిండి ఉంటుంది. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను నమోదు చేస్తుందో తెలుసుకోవడానికి కొంత కాలం వేచి ఉండాలి.

More from DriveSpark

Article Published On: Friday, September 3, 2021, 16:45 [IST]
English summary
2022 moto guzzi v85 tt launched in india at rs 15 40 lakhs features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+