SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎప్రిలియా తన ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ త్వరలో విడుదల చేయనుంది. దేశీయ మార్కెట్లో ఇది కొత్త మాక్సి-స్కూటర్ సమర్పణ అవుతుంది. అయితే కంపెనీ ఈ స్కూటర్ విడుదల చేయడానికి ముందే ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ఆవిష్కరించింది. దీని ధర ఢిల్లీ, ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.16 లక్షలు.

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ఎప్రిలియా యొక్క ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర దాని మునుపటి ఎస్ఎక్స్ఆర్ 160 ధర కన్నా 9,000 రూపాయలు తక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ ధరలు ఇప్పుడు బ్రాండ్ యొక్క వెబ్‌సైట్‌లో వెల్లడయ్యాయి. కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ కోసం రూ. 5 వేల టోకెన్ మొత్తానికి చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ నాలుగు కలర్ అప్షన్లలో లభిస్తుంది. అవి వైట్, మాట్టే బ్లూ, రెడ్ మరియు నీరో గ్రే అనే కలర్స్. ఈ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా మరియు వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే,ఇది దాని ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ నుంచి తీసుకోబడింది. అయితే ఎస్ఎక్స్ఆర్ 125 లో 125 సిసి సింగిల్-సిలిండర్ ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.3 బిహెచ్‌పి శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 9.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ఎస్ఎక్స్ఆర్ 125 యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్‌లతో ట్రిపుల్ హెడ్‌ల్యాంప్ డిజైన్ యొక్క బ్రాండ్ సిగ్నేచర్ ఉంది. ఇది భారీ ఫ్రంట్ ఆప్రాన్, లార్జ్ టిన్టెడ్ విజర్, ఎల్‌ఇడి టెయిల్ లైట్లు, అల్లాయ్స్ వీల్స్, ఎగ్జాస్ట్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

MOST READ:కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్‌పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

అంతే కాకుండా ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైడర్ మరియు పిలియన్ కోసం పెద్ద సీటు, ఫ్రంట్ ఆప్రాన్‌కు ఇరువైపులా గ్లోవ్‌బాక్స్ ఒక వైపు యుఎస్‌బి ఛార్జర్‌, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ మరియు బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ఈ కొత్త స్కూటర్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్ సెటప్ ఉంటాయి. ఇందులో మంచి బ్రేకింగ్ సిస్టం అందుబాటులో ఉంటుంది. దీని ముందు భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 140 మిమీ డ్రమ్ బ్రేక్ కలిగి ఉండి, అదనపు భద్రత కోసం కంబైన్ బ్రేకింగ్ సిస్టం ఉంటుంది.

MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 భారత మార్కెట్లో లాంచ్ అయిన తరువాత సుజుకి బర్గ్ మన్ స్ట్రీట్ 125 కు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు స్కూటర్ల యొక్క ధర విషయానికి వస్తే ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ బర్గ్ మన్ స్ట్రీట్ 125 కన్నా రూ. 27,000 అధిక ధర కలిగి ఉంటుంది.

SXR 125 స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా; డిజైన్ & ఫీచర్స్

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ భారత మార్కెట్లో కూడా విక్రయించబడుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే దాని మునుపటి మోడల్స్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. కానీ ఈ 125 సిసి స్కూటర్ ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల, మార్కెట్లో విడుదలైన తర్వాత ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

MOST READ:కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న కొత్త సొనెట్ & సెల్టోస్

Most Read Articles

English summary
Aprilia SXR 125 Price Officially Revealed. Read in Telugu.
Story first published: Wednesday, April 28, 2021, 13:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X