మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

జపనీస్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కవాసాకి, భారత మార్కెట్లో తమ కొత్త 2021 నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ఈ కొత్త 2021 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్‌లో విడుదల కానుంది.

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

ఆటోకార్ఇండియా నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, కవాసకి బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ అయిన నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ మార్చ్ 2021లో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని సమాచారం. మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ లేటెస్ట్ జనరేషన్ మోడల్ కొత్త డిజైన్ మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

ముందుగా డిజైన్ విషయానికి వస్తే, కొత్త 2021 కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ బ్రాండ్ యొక్క హె2 మోడల్ నుండి స్పూర్తి పొందిన ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు డ్యూయల్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్‌తో మరింత అగ్రెసివ్‌గా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది.

MOST READ: పెరిగిన బజాజ్ డొమినార్ బైక్స్ ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

కొత్త 2021 నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ కూడా కౌల్-ఇంటిగ్రేటెడ్ వింగ్‌లెట్స్‌తో వస్తుంది, ఫలితంగా ఇది డౌన్‌ఫోర్స్‌ను 17 శాతం మెరుగుపరుస్తుంది. అలాగే, ఇందులో 40 మిమీ పొడవైన కర్వడ్ విండ్‌స్క్రీన్ కూడా ఉంటుంది, ఇది హై స్పీడ్స్‌లో గాలి నుండి రైడర్‌కు రక్షణ కల్పిస్తూ మంచి విజిబిలిటీని ఆఫర్ చేస్తుంది. జెడ్‌ఎక్స్-10ఆర్ వెనుక డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్ లుక్‌ని కలిగి ఉంటుంది.

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ 2021 మోడల్‌లో సరికొత్త ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో సరికొత్త 4.3 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇంకా ఈ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్స్, కార్నరింగ్ ఏబిఎస్, లాంచ్ కంట్రోల్, ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

ఇక ఇంజన్ విషయానికొస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త 2021 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ అప్‌డేట్ చేసిన యూరో5 కంప్లైంట్ 998సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 13,200 ఆర్‌పిఎమ్ వద్ద 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

ఈ ఇంజన్ మనదేశంలో బిఎస్6 నిబంధనలకు సమానంగా ఉంటుంది. భారత్‌లో విడుదల కాబోయే కొత్త 2021 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఇదే ఇంజన్‌‌ను కొనసాగించవచ్చని సమాచారం.

MOST READ: షాకింగ్ న్యూస్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిస్‌కంటిన్యూ, వైబ్‌సైట్ నుండి మాయం!

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

ఇందులోని మెకానికల్స్‌ను గమనిస్తే, ముందు భాగంలో 43 ఇన్‌వెర్టెడ్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ రెండింటినీ పూర్తిగా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందువైపు డ్యూయల్ 330 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు సింగిల్ 220 మిమీ డిస్క్ ఉంటుంది. ఇది డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తుంది.

మార్చ్‌లో కొత్త 2021 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల; వివరాలు

కొత్త 2021 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ పూర్తిగా అప్‌డేట్ చేయబడిన డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లతో రానుంది. మార్కెట్లో ఈ కవాసకి బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ అప్‌డేటెడ్ వెర్షన్ ధర సుమారు రూ.13 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kawasaki Plans To Launch All-New 2021 Ninja ZX-10R In India Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X