దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ యమహా ఆర్15 (Yamaha YZF-R15) లో నాల్గవ తరం మోడల్ ని మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2021 Yamaha YZF-R15 V4 తో పాటుగా కంపెనీ ఇందులో YZF-R15M స్పోర్టీయర్ వేరియంట్ ను కూడా విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

మునుపటి తరం Yamaha YZF-R15 V3 తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 Yamaha YZF-R15 V4 లో కంపెనీ కొన్ని ముఖ్యమైన స్టైలింగ్ అప్‌గ్రేడ్‌ లను చేసింది. దేశీయ మార్కెట్లో స్టాండర్డ్ మరియు ఎమ్ అనే రెండు వేరియంట్లలో లభించే కొత్త 2021 YZF-R15 V4 బైక్ ధరలు రూ. 1.68 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. వేరియంట్ల వారీగా ఈ బైక్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

YZF-R15 మెటాలిక్ రెడ్: రూ. 1,67,800

YZF-R15 డార్క్ నైట్: రూ. 1,68,800

YZF-R15 రేసింగ్ బ్లూ: రూ. 1,72,800

YZF-R15 M: రూ. 1,77,800

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

కంపెనీ తాజాగా విడుదల చేసిన ఈ సరికొత్త 2021 Yamaha YZF-R15 V4 ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్ లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లతో పాటుగా యాంత్రికంగా కూడా గణనీయమైన మార్పులు ఉన్నాయి. అంటే, దీని అర్థం కొత్త 2021 Yamaha YZF-R15 V4 లుక్ పరంగా మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

కొత్త 2021 సిరీస్ YZF-R15 సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది మరియు ఇది సెప్టెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యమహా డీలర్‌షిప్‌ లలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త మోడళ్ల కోసం నేటి నుండే ఆన్‌లైన్ బుకింగ్‌లు కూడా ప్రారంభమవుతాయి. యమహా తమ R సిరీస్ కోసం కొత్త డిజైన్ వెర్షన్‌ని ఉపయోగించిన మొదటి మోడళ్లలో కొత్త R15 వెర్షన్ 4.0 కూడా ఒకటి. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ బైక్‌కి గొప్ప డిజైన్‌ని ఇవ్వడమే.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

స్టాండర్డ్ YZF-R15 V4 ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ సరికొత్త YZF-R15M స్పోర్టీయర్ వేరియంట్ ను రూపొందించింది. స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే ఈ ఎమ్ వేరియంట్ లో కొన్ని అదనపు భాగాలు లభిస్తాయి. కొత్త YZF-R15M లో మోన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎడిషన్ కూడా ఉంటుంది మరియు ఇది మోటోజిపి బ్రాండింగ్‌తో కూడిన ఫెయిరింగ్, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు రియర్ సైడ్ ప్యానెల్స్‌తో లభిస్తుంది.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్ లో డిజైన్ పరంగా ప్రధానమైన మార్పులు దాని ముందు భాగంలో గమనించవచ్చు. మునుపటి తరంలో మోడల్ లో కనిపించిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్ యూనిట్‌కు బదులుగా ఈ కొత్త 2021 యమహా ఆర్15 లో సింగిల్ బై-ఫంక్షనల్ క్లాస్-డి ఎల్ఈడి హెడ్‌లైట్‌ను ఉపయోగించారు. ఇది M-ఆకారంలో ఉండే ఫ్రంట్ ప్యానెల్‌లో అమర్చబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

ఇందులోని హెడ్‌లైట్ సింగిల్ బీమ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ రూపంలో లభిస్తుంది. ఈ హెడ్‌లైట్‌కి ఇరువైపులా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. కొత్త R15 లో రీడిజైన్ చేయబడిన కొత్త బాడీ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేశారు. ఇతర స్టైలింగ్ అప్‌డేట్స్‌లో దాని రియర్ డిజైన్ కూడా సవరించారు. ఇంకా ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫెయిరింగ్స్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఫెయిరింగ్స్‌పై టర్న్ ఇండికేటర్స్, M ఎయిర్-డక్ట్ డిజైన్, స్టెప్-అప్ సీట్ మరియు సైడ్-స్లింగ్ ఎగ్జాస్ట్ మొదలైనవి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

కొత్త YZF-R15M V4 మరియు YZF-R15M రెండు వేరియంట్లు కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటాయి. ఇందులో Yamaha యొక్క వై-కనెక్ట్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. ఇది బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో యూజర్లు నావిగేషన్ మరియు ఫోన్ కాల్స్‌‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 Yamaha YZF-R15 సిరీస్ మోటార్‌సైకిళ్లలో లేటెస్ట్ 155 సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 పిస్ శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) తో ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడిన ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. ఇతర మెకానికల్ భాగాల్లో ముందు వైపు అప్ సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి.

దేశీయ మార్కెట్లో కొత్త 2021 Yamaha R15 V4 మరియు R15M బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అమర్చబడి ఉంటాయి మరియు ఇవి రెండూ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. కాగా, ఇందులో క్విక్ షిఫ్టర్ ఫీచర్ YZF-R15M మరియు YZF-R15 V4 రేసింగ్ బ్లూ కలర్ వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
All new yamaha r15 v4 and yamaha r15m launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X