ఏకంగా 500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం మొదలైంది. వాహన వినియోగదారులు దాదాపుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా దాదాపు చాలా వాహన తయారీ కంపెనీలు దేశీయ మార్కెట్లో తమ ఉనికిని విస్తరించుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రసిద్ధి చెందిన ఆంపియర్ ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో 350 డీలర్‌షిప్‌లు, ఇ-రిక్షా విభాగంలో 165 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా 500 కస్టమర్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీ మరిన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

కంపెనీ ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి 20 మందికి పైగా కొత్త డీలర్లను చేర్చింది. ద్విచక్ర వాహనాలకు మరియు త్రీ-వీలర్ విభాగాలలో తమ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా రిటైల్ టచ్‌పాయింట్‌లను నిరంతరం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారులకు సంపూర్ణ 'భౌతిక' అనుభవాన్ని అందించడానికి డిజిటల్ లక్షణాలతో తన భౌతిక టచ్ పాయింట్లను అనుసంధానించినట్లు ఆంపియర్ తెలిపింది.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

సంస్థ తన పెట్టుబడిదారులు మరియు భాగస్వాములలో స్థిరమైన పెరుగుదల ఉందని, ఇది సంస్థ యొక్క లాభాలను పెంచుతుందని చెప్పారు. ఆంపియర్ యొక్క ఈ-మొబిలిటీ వ్యాపారం యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాయ్ కురియన్ మాట్లాడుతూ, మా కస్టమర్లకు మెరుగైన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కస్టమర్ అనుభవం, ఫైనాన్సింగ్ టై-అప్‌లు మరియు కస్టమర్ ఫ్రెండ్లీ ప్లాన్‌లతో అవసరమైనవన్నీ అందించడానికి కృషి చేస్తామన్నారు.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

ఈవి పాలసీ ప్రకారం వివిధ రాష్ట్రాలు అందించే FAME-II సబ్సిడీ మరియు రాయితీల తరువాత ఆంపియర్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సరసమైనవిగా మారాయి. గుజరాత్‌లో ఈవీ పాలసీ ప్రకటించిన తర్వాత ఆంపియర్ మాగ్నస్, జీల్ వంటి స్కూటర్ మోడళ్లు వాటి ధర కంటే రూ. 20,000 తక్కువగా మారాయి.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో తేలికపాటి పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది, ఇది చాలా తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి కేవలం కిలోమీటరుకు కేవలం 15 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులోని రాణిపేటలో కొత్త ఇ-మొబిలిటీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి 10 సంవత్సరాలలో 700 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంపియర్ ప్రకటించింది. ఇందుకోసం సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ సౌకర్యం 10.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది భారతదేశంలోని అత్యాధునిక ఇ-మొబిలిటీ తయారీ కర్మాగారాలలో ఒకటిగా ఉంటుంది.

500 పైగా టచ్‌పాయింట్‌లకు శ్రీకారం చుట్టిన ఆంపియర్ ఎలక్ట్రిక్

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విద్యార్థులకు, గృహిణులకు మరియు నగర ప్రాంతాల్లో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల వాహనదారులను మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Most Read Articles

English summary
Ampere Electric Has 500 Plus Touchpoints Across The Country. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X