భారత మార్కెట్లో Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు అయిన Aprilia India (ఎప్రిలియా ఇండియా) దేశీయ మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త Tuono 660 బైక్ ను ఎట్టకేలకు విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Aprilia Tuono 660 బైక్ ధర రూ. 13.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ కొనుగోలు కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాము.

Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Aprilia Tuono 660 బైక్ మూడు కలర్ అప్సన్స్ లో లభిస్తుంది.

అవి:

  • కాన్సెప్ట్ బ్లాక్
  • ఇరీడియం గ్రే
  • యాసిడ్ గోల్డ్
  • Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    కొత్త Aprilia Tuono 660 బైక్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    కొత్త Aprilia Tuono 660 బైక్ లో లిక్విడ్ కూల్డ్, DOHC, ప్యారలల్ ట్విన్ సిలిండర్ 659 సిసి ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 94 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    Aprilia Tuono 660 (ఎప్రిలియా టుయోనో 660) బైక్ డిజైన్‌ దాని RS 660 ఆధారంగా రూపొందించబడింది. ఈ మిడ్-వెయిట్ సూపర్‌స్పోర్ట్ బైక్ దాని పెద్ద తోబుట్టువు అయిన RSV4 నుండి ప్రేరణ పొందింది, ఇది బ్రాండ్ యొక్క ఏకైక త్రీ-పాడ్ హెడ్‌ల్యాంప్ సెటప్ నుండి దూకుడుగా ఉండే ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది,

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    కొత్త Tuono 660 బైక్ దాని RSV4 లో చూసినట్లుగా మంచి స్టైలిష్ లుక్‌ మరియు ఏరో వింగ్‌లెట్స్‌ కలిగి చాలా దూకుడుగా ఉంటుంది. రేస్-స్పెక్ స్టైల్ వింగ్‌లెట్లు అధిక వేగంతో ఏరోడైనమిక్ స్థిరత్వాన్ని అందిస్తాయి. కావున రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా రైడర్ నిటారుగా కూర్చోవచ్చు.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    Aprilia Tuono 660 బైక్ లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ విత్ ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, విండ్‌స్క్రీన్, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్ మరియు 15-లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయి.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    Tuono 660 బైక్ 5 రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది, ఇందులో మూడు రోడ్ రైడింగ్ మోడ్స్ కాగా మిగిలిన రెండు ట్రాక్ ఉపయోగం కోసం వినియోగించబడతాయి. ఇవన్నీ రైడర్ కి చాలా అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని అందించడంలో తోడ్పడతాయి. అంతే కాకుండా ఇందులో ఎప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్ (ATC), ఎప్రిలియా వీలీ కంట్రోల్ (AWC), ఎప్రిలియా క్రూయిజ్ కంట్రోల్ (ACC), ఎప్రిలియా ఇంజిన్ బ్రేక్ (AEB), ఎప్రిలియా ఇంజిన్ మ్యాప్ (AEM) మరియు ఏబీఎస్ కార్నర్ ఫంక్షన్ కూడా ఉంటాయి.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    ఇది బైక్ యొక్క అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడంలో సహాయపడే 5 ఇంచెస్ TFT స్ప్లిట్-స్క్రీన్ లేఅవుట్‌ను కూడా కలిగి ఉంది. కంపెనీ కనెక్ట్ చేసిన టెక్నాలజీ కోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌గా Aprilia MIA మల్టీమీడియా ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. కొత్త Aprilia Tuono 660 బైక్ డ్యూయల్ బీమ్ చాసిస్ కలిగి ఉంది.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    Aprilia Tuono 660 యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1370 మిమీ పొడవు, 1995 మిమీ వెడల్పు, 805 మిమీ సీట్ హైట్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్ బరువు 183 కిలోల వరకు ఉంటుంది. కొత్త Aprilia Tuono 660 బైక్ భారతీయ మార్కెట్‌లో ఎక్కువమంది బైక్ ప్రేమికులను ఖచ్చితంగా ఆకర్శించగలదు.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    Tuono 660 బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ కయబా USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. కానీ ఈ రెండూ కూడా కంప్రెషన్, రీబౌండ్ మరియు ప్రీలోడ్ కోసం పూర్తిగా అడ్జస్ట్ చేయగలవు.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    ఇక ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో బ్రెమో ఫోర్-పాట్ రేడియల్ కాలిపర్‌లతో 320 మిమీ డ్యూయల్-డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో బ్రెంబో కాలిపర్‌లతో 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. కావున ఇది బైక్ ని కంట్రోల్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    ఈ బైక్ ముందు భాగంలో 120/70 సెక్షన్ టైర్‌తో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక భాగంలో 180/55 సెక్షన్ టైర్‌తో 17ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి పట్టుని కూడా అందిస్తుంది.

    Aprilia నుంచి మరో బైక్ విడుదల; ధర రూ. 13.09 లక్షలు

    Aprilia Tunon 660 బైక్ దాని RS660 నుండి దాదాపు అన్ని పరికరాలను పొందుతుంది. ఈ బైక్ రోజూవారీ ఉపయోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. Aprilia Tunon 660 బైక్ దేశీయ మార్కెట్లో హోండా CB650R, కవాసకి Z650, ట్రయంఫ్ ట్రైడెంట్ 660 మరియు KTM డ్యూక్ 790 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 3, 2021, 9:27 [IST]
English summary
Aprilia launched new tuono 660 middle weight motorcycle in india price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+