RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

ప్రముఖ బైక్ తయారీ సంస్థ Aprilia భారతీయ విఫణిలో ఇటీవల తన RS 660 బైక్ విడుదల చేసింది. ఈ కొత్త RS 660 కోసం బుకింగ్‌లు 2021 ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు కంపెనీ ఎట్టకేలకు ఈ సూపర్ బైక్ యొక్క డెలివరీలు ప్రారంభించింది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

ఇప్పటికి అందుబాటులో ఉన్న ఫోటోల ప్రకారం ఈ బైక్ యొక్క ఫస్ట్ యూనిట్ డెలివరీ ఒక మహిళకు అందించడం జరిగింది. Aprilia RS660 బైక్ కంపెనీ లైనప్‌లో ఇది నాలుగో బైక్. కంపెనీ ఈ బైక్ ని గత సెప్టెంబర్‌లోనే రూ. 13.39 లక్షలకు విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది యాసిడ్ గోల్డ్, అపెక్స్ బ్లాక్ మరియు లావా రెడ్ అనే మూడు కలర్స్ లో అందుబాటులో ఉంది.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

కొత్త Aprilia RS 660 బైక్ లిక్విడ్-కూల్డ్, DOHC, ప్యారలల్ ట్విన్-సిలిండర్ 659 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 99 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ మరియు బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

Aprilia RS 660 బైక్ లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ విత్ ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, విండ్‌స్క్రీన్, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్, రేస్-స్పెక్ హ్యాండిల్‌బార్ మరియు 15-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ వంటివి ఉన్నాయి. RS 660 బైక్ 5 రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది, ఇందులో మూడు రోడ్ రైడింగ్ మోడ్స్ కాగా మిగిలిన రెండు ట్రాక్ ఉపయోగం కోసం వినియోగించబడతాయి. ఇవన్నీ రైడర్ కి చాలా అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని అందించడంలో తోడ్పడతాయి.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

Aprilia యొక్క కొత్త బైక్ లో 5 ఇంచెస్ TFT స్ప్లిట్-స్క్రీన్ లేఅవుట్‌ను కలిగి ఉంది, ఇది మోటార్‌సైకిల్‌ యొక్క కంట్రోల్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బైక్ లో కంపెనీ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కనెక్టెడ్ టెక్నాలజీ కోసం ఆప్సనల్ Aprilia MIA మల్టీమీడియా ప్లాట్‌ఫామ్‌ని కూడా అందిస్తోంది.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ అల్యూమినియం డ్యూయల్ బీమ్ చాసిస్ కలిగి ఉంది. ఈ బైక్ అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కలియు ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ కయబా USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. కానీ ఈ రెండూ కూడా కంప్రెషన్, రీబౌండ్ మరియు ప్రీలోడ్ కోసం పూర్తిగా అడ్జస్ట్ చేయగలవు.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

ఇక ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో బ్రెమో ఫోర్-పాట్ రేడియల్ కాలిపర్‌లతో 320 మిమీ డ్యూయల్-డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో బ్రెంబో కాలిపర్‌లతో 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. కావున ఇది బైక్ ని కంట్రోల్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ బైక్ ముందు భాగంలో 120/70 సెక్షన్ టైర్‌తో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక భాగంలో 180/55 సెక్షన్ టైర్‌తో 17ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి పట్టుని కూడా అందిస్తుంది. Aprilia RS 660 బైక్ బరువు కేవలం 185 కేజీలు మాత్రమే. కానీ మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

RS 660 బైక్ డెలివరీలు షురూ చేసిన Aprilia.. వివరాలు

భారతదేశంలో వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Aprilia RS 660 మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ డెలియరీలు ప్రారంభమయ్యాయి. అయితే కొత్త Aprilia RS 660 బైక్ దేశీయ మార్కెట్లో Honda CBR 650R, Kawasaki Ninja 650 మరియు Kawasaki Ninja ZX-6R వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Aprilia India (ఎప్రిలియా ఇండియా) దేశీయ మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త Tuono 660 బైక్ ను కూడా విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Aprilia Tuono 660 బైక్ ధర రూ. 13.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ కొనుగోలు కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

Image Courtsy: Alisha Abdullah

Most Read Articles

English summary
Aprilia rs 660 delivery starts in india price features specifications details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X