Just In
- 1 hr ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 14 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 18 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 20 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
దేశీయ మార్కెట్లో విడుదలైన Aprilia RS 660; ధర రూ. 13.39 లక్షలు
భారతీయ విఫణిలో Aprilia తన RS 660 బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ధర రూ. 13.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). Aprilia RS 660 మిడిల్-వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ భారతదేశానికి సిబియు మార్గం ద్వారా వస్తుంది. RS 660 కోసం బుకింగ్‌లు 2021 ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమయ్యాయి. కావున ఈ మోటార్‌సైకిల్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.
Aprilia RS 660 బైక్ మంచి డిజైన్ కలిగి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ యొక్క డిజైన్ దాని Aprilia RSV4 నుండి తీసుకుంది. Aprilia RS 660 మోటార్‌సైకిల్ RSV4 లో కనిపించే విధంగా దూకుడుగా కనిపించే ఫుల్ ఫెయిరింగ్ మరియు ఏరో వింగ్లెట్లను కలిగి ఉంది. RS 660 బైక్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ కూడా పొందుతుంది.
కొత్త Aprilia RS 660 బైక్ మూడు కలర్ ఆప్షన్లలో విక్రయింబడుతుంది.
అవి:
- యాసిడ్ గోల్డ్
- అపెక్స్ బ్లాక్
- లావా రెడ్
Aprilia RS 660 బైక్ లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, విండ్‌స్క్రీన్, అండర్బెల్లీ ఎగ్జాస్ట్, రేస్-స్పెక్ హ్యాండిల్‌బార్ మరియు 15-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయి.
RS 660 బైక్ 5 రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది, ఇందులో మూడు రోడ్ రైడింగ్ మోడ్స్ కాగా మిగిలిన రెండు ట్రాక్ ఉపయోగం కోసం వినియోగించబడతాయి. ఇవన్నీ రైడర్ కి చాలా అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని అందించడంలో తోడ్పడతాయి.
Aprilia యొక్క కొత్త బైక్ లో 5 ఇంచెస్ TFT స్ప్లిట్-స్క్రీన్ లేఅవుట్‌ను కలిగి ఉంది, ఇది మోటార్‌సైకిల్ యొక్క కంట్రోల్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బైక్ లో కంపెనీ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కనెక్టెడ్ టెక్నాలజీ కోసం ఆప్సనల్ Aprilia MIA మల్టీమీడియా ప్లాట్‌ఫామ్‌ని కూడా అందిస్తోంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ అల్యూమినియం డ్యూయల్ బీమ్ చాసిస్ కలిగి ఉంది. ఈ బైక్ అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కలియు ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ కయబా USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. కానీ ఈ రెండూ కూడా కంప్రెషన్, రీబౌండ్ మరియు ప్రీలోడ్ కోసం పూర్తిగా అడ్జస్ట్ చేయగలవు.
ఇక ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో బ్రెమో ఫోర్-పాట్ రేడియల్ కాలిపర్లతో 320 మిమీ డ్యూయల్-డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో బ్రెంబో కాలిపర్లతో 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. కావున ఇది బైక్ ని కంట్రోల్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ బైక్ ముందు భాగంలో 120/70 సెక్షన్ టైర్‌తో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక భాగంలో 180/55 సెక్షన్ టైర్‌తో 17ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి పట్టుని కూడా అందిస్తుంది. Aprilia RS 660 బైక్ బరువు కేవలం 185 కేజీలు మాత్రమే. కానీ మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.
కొత్త Aprilia RS 660 బైక్ లిక్విడ్-కూల్డ్, DOHC, ప్యారలల్ ట్విన్-సిలిండర్ 659 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 99 బిహెచ్పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ మరియు బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Aprilia RS 660 మిడిల్ వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ విడుదలైంది. ఇది దేశీయ మార్కెట్లో Honda CBR 650R, Kawasaki Ninja 650 మరియు Kawasaki Ninja ZX-6R వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.