అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

ప్రముఖ ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ ఏప్రిలియా (Aprilia) దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన డిమాండ్ పొందింది. ఇందులో భాగంగానే కంపెనీ భారతదేశం తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. అయితే కంపెనీ యొక్క స్కూటర్లు దక్షిణ భారతదేశంలోని 100 మోటోప్లెక్స్ స్టోర్లలో విక్రయించబడతాయి. ఏప్రిలియా కంపెనీ యొక్క మాతృ సంస్థ పియాజియో ఈ ప్రాంతంలో ఏప్రిలియా కంపెనీ యొక్క విజిబిలిటీని పెంచుతోంది. భారతదేశంలోని మొత్తం అమ్మకాలలో కంపెనీ యొక్క అమ్మకాలు 45 శాతం వాటాను కలిగి ఉంది.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

దీని గురించి పియాజియో ఇండియా టూ వీలర్ బిజినెస్ హెడ్ సుధాన్షు అగర్వాల్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో ఏప్రిలియా కొత్త ప్లాన్‌ల గురించి తెలియజేశారు. అంతే కాకుండా, దక్షిణ భారతదేశంలో కంపెనీ యొక్క ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కావున కంపెనీ యొక్క పరిధిని విస్తరించి బలమైన అమాంకాలను పొందటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లోని మొత్తం అమ్మకాలలో ఏప్రిలియా అమ్మకాల వాటా ఏకంగా 45 శాతం వరకు ఉంది. ఇది రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

భారతీయ మార్కెట్లో ఎప్రిలియా (Aprilia) కంపెనీ ఇటీవల కాలంలో రెండు కొత్త స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి ఎప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) కాగా మరొకటి ఎప్రిలియా SR 125 (Aprilia SR 125). ఈ రెండు స్కూటర్లు కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉన్నాయి.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) ప్రారంభ ధర రూ. రూ. 1,17,494 (ఎక్స్-షోరూమ్). ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. రూ. 1,19,975 (ఎక్స్-షోరూమ్-పూణే).

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ రెండు కొత్త ఎప్రిలియా స్కూటర్ల యొక్క డిజైన్ మరియు ఫీచర్లు అప్‌డేట్ చేయబడ్డాయి. కావున ఇది ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలను కలిగి ఉంటాయి. ఎప్రిలియా ఎస్ఆర్ 160 మరియు ఎస్ఆర్ 125 లకు ఎల్ఈడీ హెడ్‌లైట్, షార్ప్ ఫ్రంట్ ఆప్రాన్, ఏరోడైనమిక్ కౌల్, ఫుల్లీ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎక్స్-ఆకారపు టెయిల్ లైట్, వైడ్ గ్రాబ్ రైల్ మరియు స్టైలిష్ స్ప్లిట్ సీట్ వంటి వాటిని పొందుతాయి.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

ఈ ఆధునిక కాలంలో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ రెండు స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించింది. ఇందులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, రియల్ టైమ్ మైలేజ్, స్పీడ్, కాల్-మెసేజ్ అలర్ట్, స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వంటి అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

ఇందులో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కావాలనుకుంటే కేవలం 2,000 రూపాయలతో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కంపెనీ అండర్-సీట్ లైట్ మరియు USB ఛార్జర్ వంటి వాటిని కూడా స్టాండర్డ్ ఫీచర్లుగా చేర్చింది.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

ఎప్రిలియా ఎస్ఆర్ 160 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 160.3 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 11 బిహెచ్‌పి పవర్ మరియు 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఎప్రిలియా ఎస్ఆర్ 125 ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 124.45 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 9.9 బిహెచ్‌పి పవర్ మరియు 9.7 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు స్కూటర్లు సింగిల్ ఛానల్ ABS తో 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్‌ను పొందుతాయి.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

ఇక ఈ స్కూటర్లలోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ముందువైపు డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, కావున ఇవి మంచి పనితీరుని అందిస్తాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

భారతదేశంలో 160 సీసీ స్కూటర్ అందుబాటులో లేదు. అయితే Aprilia SR 160 ఇటీవల విడుదల చేసిన Yamaha Aerox 155 కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. Yamaha Aerox 155 భారతదేశంలోని ఏప్రిలియా SR 160 కి పోటీగా ఉన్న ఏకైక స్కూటర్.

అమ్మకాలను మరింత పెంచేందుకు Aprilia కొత్త ప్లాన్స్.. ఏంటో తెలుసా?

అదే సమయంలో, భారతదేశంలో 125 సీసీ సెగ్మెంట్లో అనేక కంపెనీల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హోండా, TVS మరియు సుజుకికి చెందిన స్కూటర్లు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఫీచర్ల పరంగా, ఏప్రిలియా SR 125 దాని సెగ్మెంట్‌లోని ఇతర స్కూటర్‌ల కంటే చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. అయినప్పటికీ ఏప్రిలియా SR 125 భారతీయ మార్కెట్లో హోండా యాక్టివా 125, TVS Ntorq 125 మరియు సుజుకి యాక్సెస్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 23, 2021, 11:34 [IST]
English summary
Aprilia scooters to be sold at motoplex stores in south india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+