భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

భారతీయ మార్కెట్లో ఎప్రిలియా (Aprilia) కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు కొత్త స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి ఎప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) కాగా మరొకటి ఎప్రిలియా SR 125 (Aprilia SR 125). ఈ రెండు స్కూటర్లు కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉన్నాయి. ఎప్రిలియా విడుదల చేసిన ఈ స్కూటర్ల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) ప్రారంభ ధర రూ. రూ. 1,17,494 (ఎక్స్-షోరూమ్). ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

అవి:

 • ఎప్రిలియా ఎస్ఆర్ 160 స్టాండర్డ్: రూ. 1,17,494
 • ఎప్రిలియా ఎస్ఆర్ 160 రేస్: రూ. 1,26,636
 • ఎప్రిలియా ఎస్ఆర్ 160 కార్బన్: రూ. 1,19,975 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్-పూణే).
 • భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  ఇక ఎప్రిలియా ఎస్ఆర్ 125 విషయానికి వస్తే, దీని ధర రూ. 1,07,595 (ఎక్స్-షోరూమ్, పూణే). ఈ స్కూటర్ కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఇది కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ రెండు కొత్త ఎప్రిలియా స్కూటర్ల యొక్క డిజైన్ మరియు ఫీచర్లు అప్‌డేట్ చేయబడ్డాయి. కావున ఇది ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలను కలిగి ఉంటాయి. ఎప్రిలియా ఎస్ఆర్ 160 మరియు ఎస్ఆర్ 125 లకు ఎల్ఈడీ హెడ్‌లైట్, షార్ప్ ఫ్రంట్ ఆప్రాన్, ఏరోడైనమిక్ కౌల్, ఫుల్లీ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎక్స్-ఆకారపు టెయిల్ లైట్, వైడ్ గ్రాబ్ రైల్ మరియు స్టైలిష్ స్ప్లిట్ సీట్ వంటి వాటిని పొందుతాయి.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  ఈ ఆధునిక కాలంలో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ రెండు స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించింది. ఇందులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, రియల్ టైమ్ మైలేజ్, స్పీడ్, కాల్-మెసేజ్ అలర్ట్, స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వంటి అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  ఇందులో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కావాలనుకుంటే కేవలం 2,000 రూపాయలతో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కంపెనీ అండర్-సీట్ లైట్ మరియు USB ఛార్జర్ వంటి వాటిని కూడా స్టాండర్డ్ ఫీచర్లుగా చేర్చింది.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  ఎప్రిలియా ఎస్ఆర్ 160 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 160.3 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 11 బిహెచ్‌పి పవర్ మరియు 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  అదేవిధంగా ఎప్రిలియా ఎస్ఆర్ 125 ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 124.45 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 9.9 బిహెచ్‌పి పవర్ మరియు 9.7 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు స్కూటర్లు సింగిల్ ఛానల్ ABS తో 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్‌ను పొందుతాయి.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  ఇక ఈ స్కూటర్లలోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ముందువైపు డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, కావున ఇవి మంచి పనితీరుని అందిస్తాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  భారతదేశంలో 160 సీసీ స్కూటర్ అందుబాటులో లేదు. అయితే Aprilia SR 160 ఇటీవల విడుదల చేసిన Yamaha Aerox 155 కి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. Yamaha Aerox 155 భారతదేశంలోని ఏప్రిలియా SR 160 కి పోటీగా ఉన్న ఏకైక స్కూటర్.

  భారత్‌లో 2022 Aprilia SR 125 & SR 160 లాంచ్: ధర, ఫీచర్స్ & వివరాలు

  అదే సమయంలో, భారతదేశంలో 125 సీసీ సెగ్మెంట్లో అనేక కంపెనీల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హోండా, TVS మరియు సుజుకికి చెందిన స్కూటర్లు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఫీచర్ల పరంగా, ఏప్రిలియా SR 125 దాని సెగ్మెంట్‌లోని ఇతర స్కూటర్‌ల కంటే చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. అయినప్పటికీ ఏప్రిలియా SR 125 భారతీయ మార్కెట్లో హోండా యాక్టివా 125, TVS Ntorq 125 మరియు సుజుకి యాక్సెస్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Aprilia sr 160 sr 125 launched in india price features details
Story first published: Tuesday, November 16, 2021, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X