SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

భారత మార్కెట్లో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 మాక్సి స్కూటర్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఈ స్కూటర్ మార్కెట్లో విడుదల కాకముందే కంపెనీ ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఈ కొత్త స్కూటర్ నాలుగు కలర్ ఆప్సన్లలో అందించబడుతుంది. అవి గ్లోసీ రెడ్, మాట్టే బ్లూ, గ్లోసీ వైట్ మరియు మాట్టే బ్లాక్ కలర్స్. ఈ స్కూటర్ డెలివరీలు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఎస్ఎక్స్ఆర్ 125 ఇప్పుడు బ్రాండ్ యొక్క మాక్సి-స్కూటర్ లైనప్‌లో ప్రత్యేకమైందిగా ఉంది.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ చూడటానికి ఎస్ఎక్స్ఆర్ 160 డిజైన్ కలిగి ఉంటుంది. డిజైన్ మాత్రమే కాదు ఇది ఎస్ఎక్స్ఆర్ 160 లోని చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ రెండు స్కూటర్ల ధరల మధ్య తేడా కేవలం 11,000 రూపాయలు మాత్రమే. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 బ్రాండ్ యొక్క లైనప్‌లోని ఎస్ఆర్ 125 స్కూటర్ మాదిరిగానే పనిచేస్తుంది.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఈ స్కూటర్ 125 సిసి సింగిల్-సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజిన్ కలిగి ఉండి, 7,600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.3 బిహెచ్‌పి శక్తిని మరియు 6250 ఆర్‌పిఎమ్ వద్ద 9.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఈ కొత్త స్కూటర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్ లతో ట్రిపుల్ హెడ్‌ల్యాంప్ డిజైన్ యొక్క బ్రాండ్ సిగ్నేచర్ సెటప్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో మ్యాసివ్ ఫ్రంట్ ఆప్రాన్, లార్జ్ టింటేడ్ విజర్, ఎల్‌ఇడి టెయిల్ లైట్స్, అల్లాయ్స్ వీల్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైడర్ మరియు పిలియన్ కోసం విస్తృత సీట్లు, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ ఆప్షన్ వంటివి ఉన్నాయి.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఈ స్కూటర్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్ సెటప్ ఉంటుంది. అదే విధంగా స్కూటర్‌ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే ముందు భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 140 మిమీ డ్రమ్ బ్రేక్ కలిగి ఉంటుంది.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా అధునాతన టెక్నలజీ కలిగి ఉండటం వాళ్ళ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ ఈ ఇంజిన్ కేటగిరీలో అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 భారతదేశంలో లభించే బ్రాండ్ యొక్క కొత్త మాగ్జి-స్కూటర్లలో సరసమైన ఎంట్రీ లెవెల్ స్కూటర్ అవుతుంది. భారత మార్కెట్లో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ 125 బైక్ కి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 13, 2021, 12:32 [IST]
English summary
Aprilia SXR 125 Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+