ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..
ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ ఆప్రిలియా తమ సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'టువరెగ్ 660'ని అధికారికంగా ఆవిష్కరించింది. టువరెగ్ 660తో ఆప్రిలియా దాదాపు 27 సంవత్సరాల తర్వాత 'ADV' (అడ్వెంచర్) కేటగిరీలో ఈ పాపులర్ పేరును తిరిగి పరిచయం చేస్తోంది.

ఒరిజినల్ ఆప్రిలియా టువరెగ్ మోడల్‌ను 1980 కాలంలో ప్రారంభించబడింది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఉత్తమ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లలో ఇది మంచి ఖ్యాతిని పొందింది.

సహారా ఎడారిలో నివసిస్తున్న టువరెగ్ ప్రజల నుండి 'టవరెగ్' అనే పదం వచ్చింది. సహారా ఎడారిలో అత్యంత కఠినమైన వాతావరణంలో నివసించే మనుషుల మాదిరిగానే, ఈ టువరెగ్ 660 కూడా కఠినమైన రోడ్లపై సైతం సులువుగా సాగిపోయే గుణాన్ని కలిగి ఉంటుందని ఆప్రిలియా పేర్కొంది.

ఒరిజినల్ టువరెగ్ విజయానికి కారణమైన వాటిని ఈ కొత్త టువరెగ్ 660 డిజైలో గుర్తించవచ్చు. ఈ కొత్త బైక్‌లోని ప్రతి డిజైన్ ఎలిమెంట్‌కు ఒక ప్రయోజనం ఉంటుంది. 1980 వ దశకంలోని అసలైన టువరెగ్‌కు నివాళిగా ఈ కొత్త టువెరెగ్ 660 బైక్‌ని రూపొందించారు. ఇప్పుడు ఇది ఒరిజనల్ రెడ్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించబడింది.

ఒరిజినల్ టువరెగ్ మాదిరిగానే, ఈ కొత్త 2021 టువరెగ్ 660 కూడా స్పష్టమైన ర్యాలీ-స్టైల్ విండ్‌స్క్రీన్, అగ్రెసివ్‌గా కనిపించే ట్రిపుల్ ఎల్ఈడి హెడ్‌లైట్, పెద్ద ఫ్రంటల్ ఎయిర్ స్కూప్స్, ఫ్లాట్ సింగిల్-పీస్ సీట్, ర్యాప్-అరౌండ్ మెటల్ స్కిడ్ ప్లేట్స్, మెటల్ ఫుట్‌పెగ్‌లు, హ్యాండ్ గార్డులు మరియు భారీ చక్రాలతో ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.

ఆప్రిలియా ఆర్ఎస్660 మరియు టుయునో 660 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ కొత్త ఆప్రిలియా టువరెగ్ 660 లోనూ ఉపయోగించారు. కంపెనీ ఇటీవలే ఈ కొత్త 2021 మోడల్ ఆప్రిలియా టువరెగ్ 660 మోడల్‌కి సంబంధించిన ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.
ఆప్రిలియా టువరెగ్ 660 మెకానికల్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్రెంబో బ్రేకులు, ట్యూబ్‌లెస్ టైర్ అనుకూల క్రాస్-స్పోక్ వీల్స్, 9.5 ఇంచ్ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, ట్రాక్షన్ కంట్రోల్, నాలుగు రైడ్ మోడ్‌లు, ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 5-అంగుళాల టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

కాగా, కంపెనీ ఇప్పటి వరకు టువరెగ్ 660 ఇంజన్ స్పెసిఫికేషన్లను మరియు ధరపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఇది ఈ విభాగంలో యమహా టెనెరే 700 మరియు కెటిఎమ్ 890 అడ్వెంచర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని సమాచారం. ఇది గ్లోబల్ మార్కెట్లలోనే కాకుండా, భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








