ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ ఆప్రిలియా తమ సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'టువరెగ్ 660'ని అధికారికంగా ఆవిష్కరించింది. టువరెగ్ 660తో ఆప్రిలియా దాదాపు 27 సంవత్సరాల తర్వాత 'ADV' (అడ్వెంచర్) కేటగిరీలో ఈ పాపులర్ పేరును తిరిగి పరిచయం చేస్తోంది.

ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

ఒరిజినల్ ఆప్రిలియా టువరెగ్ మోడల్‌ను 1980 కాలంలో ప్రారంభించబడింది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఉత్తమ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లలో ఇది మంచి ఖ్యాతిని పొందింది.

ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

సహారా ఎడారిలో నివసిస్తున్న టువరెగ్ ప్రజల నుండి 'టవరెగ్' అనే పదం వచ్చింది. సహారా ఎడారిలో అత్యంత కఠినమైన వాతావరణంలో నివసించే మనుషుల మాదిరిగానే, ఈ టువరెగ్ 660 కూడా కఠినమైన రోడ్లపై సైతం సులువుగా సాగిపోయే గుణాన్ని కలిగి ఉంటుందని ఆప్రిలియా పేర్కొంది.

ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

ఒరిజినల్ టువరెగ్ విజయానికి కారణమైన వాటిని ఈ కొత్త టువరెగ్ 660 డిజై‌లో గుర్తించవచ్చు. ఈ కొత్త బైక్‌లోని ప్రతి డిజైన్ ఎలిమెంట్‌కు ఒక ప్రయోజనం ఉంటుంది. 1980 వ దశకంలోని అసలైన టువరెగ్‌కు నివాళిగా ఈ కొత్త టువెరెగ్ 660 బైక్‌ని రూపొందించారు. ఇప్పుడు ఇది ఒరిజనల్ రెడ్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించబడింది.

ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

ఒరిజినల్ టువరెగ్ మాదిరిగానే, ఈ కొత్త 2021 టువరెగ్ 660 కూడా స్పష్టమైన ర్యాలీ-స్టైల్ విండ్‌స్క్రీన్, అగ్రెసివ్‌గా కనిపించే ట్రిపుల్ ఎల్ఈడి హెడ్‌లైట్, పెద్ద ఫ్రంటల్ ఎయిర్ స్కూప్స్, ఫ్లాట్ సింగిల్-పీస్ సీట్, ర్యాప్-అరౌండ్ మెటల్ స్కిడ్ ప్లేట్స్, మెటల్ ఫుట్‌పెగ్‌లు, హ్యాండ్ గార్డులు మరియు భారీ చక్రాలతో ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.

ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

ఆప్రిలియా ఆర్ఎస్660 మరియు టుయునో 660 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ కొత్త ఆప్రిలియా టువరెగ్ 660 లోనూ ఉపయోగించారు. కంపెనీ ఇటీవలే ఈ కొత్త 2021 మోడల్ ఆప్రిలియా టువరెగ్ 660 మోడల్‌కి సంబంధించిన ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.

ఆప్రిలియా టువరెగ్ 660 మెకానికల్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్రెంబో బ్రేకులు, ట్యూబ్‌లెస్ టైర్ అనుకూల క్రాస్-స్పోక్ వీల్స్, 9.5 ఇంచ్ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, ట్రాక్షన్ కంట్రోల్, నాలుగు రైడ్ మోడ్‌లు, ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 5-అంగుళాల టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

ఆప్రిలియా టువరెగ్ 660 ఆవిష్కరణ; 27 ఏళ్ల తర్వాత వస్తున్న అడ్వెంచర్ బైక్..

కాగా, కంపెనీ ఇప్పటి వరకు టువరెగ్ 660 ఇంజన్ స్పెసిఫికేషన్లను మరియు ధరపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఇది ఈ విభాగంలో యమహా టెనెరే 700 మరియు కెటిఎమ్ 890 అడ్వెంచర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని సమాచారం. ఇది గ్లోబల్ మార్కెట్లలోనే కాకుండా, భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని సమాచారం.

Most Read Articles

English summary
Aprilia Tuareg 660 Adventure Motorcycle Unveiled; India Launch Expected, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X