Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తమ స్కూటర్ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఆరు నెలల పాటు అన్ని ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనెక్టివిటీ ఫీచర్లను ఉచితంగా అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ ఆఫర్‌ను తమ వినియోగదారులకు దీపావళి బోనస్‌గా ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ తరుణ్ మెహతా ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని అన్ని కనెక్టివిటీ ఫీచర్ల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) అయిన 'ఏథర్ కనెక్ట్‌' ని రీడిజైన్ చేసే ప్రణాళికలను కూడా ఆయన తెలియజేశారు. రూట్ ప్లానింగ్, నావిగేషన్, ఛార్జింగ్, సర్వీసింగ్ మరియు కస్టమైజేషన్‌తో సహా మొత్తం ఏథర్ కనెక్ట్ మొబిలిటీ అనుభవాన్ని అతుకులు లేకుండా చేయడానికి తమ వద్ద ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక ఉందని తరుణ్ మెహతా చెప్పారు.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

సేవల నాణ్యతను మెరుగుపరచడం, UI ని రీడిజైన్ చేయడం మరియు అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించడం వంటి పలు మార్పులను తమ నుంచి ఆశించవచ్చని కూడా ఆయన సూచించారు. "నవంబర్ 15 నుండి మే 15 వరకు, ఏథర్ కనెక్ట్ ప్రో సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ యొక్క అన్ని ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ యొక్క ప్రస్తుత మరియు కొత్త యజమానులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ఒకవేళ ఇప్పటికే ఎవరైనా కస్టమర్లు యాక్టివ్ కనెక్ట్ లైట్ / ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ని కలిగి ఉంటే, కంపెనీ వారికి ప్రో-రేటా ప్రాతిపదికన రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ రీఫండ్ ప్రక్రియ అమలు కావడానికి సుమారు రెండు వారాల సమయం పడుతుందని ఏథర్ ఎనర్జీ తెలిరింది. అయితే, ఇప్పటికీ ఈ సభ్యత్వం పొందని వారు మాత్రం నవంబర్ 15, 2021 నుండి మే 15, 2022 వరకు అన్ని కనెక్ట్ ప్రో ఫీచర్‌లను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ, కొన్ని నెలల క్రితం ఓ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ కంపెనీ చెన్నైలో ఓ పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ ప్లాంట్ ను ప్రారంభించి, దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా అవతరించింది. ఎథర్ ఎనర్జీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ విభాగంలో ఓలా ఎస్1, ఎస్1 ప్రో మరియు సింపుల్ వన్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటాయి.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం దేశలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లు ఉన్నాయి. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఈ కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట కు పరిచయం చేయాలని చూస్తోంది. వచ్చే రెండేళ్లలో స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్త ఉత్పత్తిని రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, వచ్చే ఏడాది మార్చి నాటికి భారతదేశంలోని 50 నగరాలకు మరియు రెండేళ్లలో 100 నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ఏథర్ ఎనర్జీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే, వీటిలో ఏథర్ 450ఎక్స్ అనేది ప్రమీయం మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 6 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 2.9 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ద్వారా స్కూటర్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 116 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే, రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్‌లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్‌లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది. ఈ స్కూటర్ లో 4G నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే స్కూటర్‌ను మరియు అందులోని ఫీచర్లను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.

Ather (ఏథర్) ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఫ్రీ.. ఫ్రీ..!

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ ఇటీవలే దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ (Ather Grid) స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ లలో ఒకటి అని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం, దేశంలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 13 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాల్లో కంపెనీ విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ లను కూడా అభివృద్ధి చేస్తోంది.

Most Read Articles

English summary
Ather energy announces free connectivity features upto 6 months on their electric scooters details
Story first published: Thursday, November 4, 2021, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X