కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, ఇటీవలే తమిళనాడులోని హోసూర్‌లో ఓ అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసినదే. కాగా, ఈ కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో తమ కార్యకలాపాను శరవేగంగా విస్తరిస్తోంది.

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

తాజాగా, ఏథర్ ఎనర్జీ కోయంబత్తూర్‌లో తమ కొత్త షోరూమ్‌ని ఓపెన్ చేసింది. కోయంబత్తూర్ మార్కెట్లో తమ పాపులర్ స్కూటర్ ఏథర్ 450 డెలివరీలను కూడా ప్రారంభించింది. మొదటి రోజునే 15 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది.

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఒకప్పుడు బెంగుళూరుకు మాత్రమే పరిమితమైన ఏథర్ ఎనర్జీ, ప్రస్తుతం భారతదేశంలోని 16 నగరాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ 450 అనే స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఏథర్ 450 ప్లస్ మరియు ఏథర్ 450ఎక్స్. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

-> ఏథర్ 450 ప్లస్ - రూ.1,42,416

-> ఏథర్ 450ఎక్స్ - రూ.1,61,426

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, కోయంబత్తూర్)

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఏథర్ ఎనర్జీ ఈ బ్యాటరీపై 3 ఏళ్ల సమగ్ర వారంటీని ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కూడా కంపెనీ 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 ఎక్స్‌డ్రైవ్ 30డి' రివ్యూ.. పూర్తి వివరాలు

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది.

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఎథర్ 450 టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఏథర్ ఎనర్జీ అందిస్తున్న టాప్-ఎండ్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. స్కూటర్ స్పేస్ గ్రే, వైట్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

MOST READ:పోలీస్ ఫోర్స్ కోసం కొత్త 2021 ఫోర్డ్ పికప్ ట్రక్కులు; పూర్తి వివరాలు

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఇంకా ఇందులో 4G నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే పూర్తి స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే, దీనిపై సంగీతం మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

కోయంబత్తూర్‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం

ఏథర్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించి, స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఫోన్ కాల్స్‌ను స్వీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు. ఇందులో పార్క్ అసిస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. దీని సాయంతో స్కూటర్‌ను రివర్స్‌లో రైడ్ చేయవచ్చు.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

Most Read Articles

English summary
Ather Energy Commences 450X Scooter Deliveries In Coimbatore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X