భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో దేశంలోనే అతిపెద్ద ఏథర్ స్పేస్ (Ather Space) షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో, కంపెనీ ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మరియు ఏథర్ 450ఎక్స్ (Ather 450X) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అమ్మకానికి అందుబాటులో ఉంచింది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ఈ షోరూమ్ ద్వారా కంపెనీ టెస్ట్ రైడ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. కోయంబత్తూర్ మార్కెట్లో Ather 450X మరియు Ather 450 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు మరియు రూ. 1.27 లక్షలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కంపెనీ తమ స్కూటర్లను కోయంబత్తూర్ నగరంలో పంపిణీ చేయడం ప్రారంభించింది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

కోయంబత్తూర్ నగరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద షోరూమ్ లో ఏథర్ ఎనర్జీ 5 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది. ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో మొదటిది ఎంట్రీ లెవల్ వేరియంట్ ఏథర్ 450 ప్లస్ మరియు రెండవది టాప్-ఎండ్ వేరియంట్ ఏథర్ 450ఎక్స్ ఉన్నాయి.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

కాగా, ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 kW ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 116 కిలోమీటర్ల వరకూ రైడ్ చేయవచ్చు. ఇది సర్టిఫైడ్ రేంజ్ మాత్రమే, వాస్తవ పరిస్థితుల్లో ఇది మారే అకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. అవి: రైడ్ మరియు ఎకో మోడ్‌లు. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. అయితే, రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ వేగం మారుతూ ఉంటుంది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ఏథర్ ఎనర్జీ ఈ బ్యాటరీపై మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ఏథర్ ఎనర్జీ అందిస్తున్న టాప్-ఎండ్ మోడల్ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 4G నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే పూర్తి స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు మరియు సంగీతం, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను మరియు లీజింగ్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా, పరిమిత కాలపు ఆఫర్‌గా ఈ స్కూటర్ కొనుగోలుపై కంపెనీ బై బ్యాక్ అష్షూరెన్స్‌ను కూడా అందిస్తోంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో కానీ లేదా మీ సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి కానీ తెలుసుకోవచ్చు.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

కంపెనీ తన మొదటి Ather Space షోరూమ్‌ను 2018 లో బెంగళూరులో ప్రారంభించింది. Ather ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, జైపూర్ మరియు అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఏథర్ ఎనర్జీ (Ather Energy) సంస్థలో పెట్టుబడులు పెట్టింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్ మరియు బిన్నీ బన్సాల్‌లు కూడా ఏథర్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టారు. ఇతర పెట్టుబడిదారులలో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టైగర్ గ్లోబల్ మరియు ఇన్నోవెన్ క్యాపిటల్‌లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ఇదిలా ఉంటా Ather Energy భారత మార్కెట్ కోసం ఓ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేయడంపై పనిచేస్తోంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉండొచ్చని సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీగా కంపెనీ ఈ కొత్త చవక స్కూటర్ లాంచ్ చేయనుంది. అయితే, దీని కోసం కస్టమర్లు మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఇది 2023 లో ప్రారంభించే అకాశం ఉంది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద Ather Space షోరూమ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

ఏథర్ ఎనర్జీ విక్రయిస్తున్న రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మహారాష్ట్రలో అతి తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ (EV పాలసీ) విధానం. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ తరువాత, రాష్ట్రంలో Ather 450 Plus ధర రూ. 1.03 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గిందని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, September 17, 2021, 13:28 [IST]
English summary
Ather energy opens india s largest ather space showroom in coimbatore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+