ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది మరియు ప్రత్యేకించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) కూడా తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తమ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా, కొత్త నగరాల్లోకి ప్రవేశిస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఏథర్ ఎనర్జీ తాజాగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో, కంపెనీ ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మరియు ఏథర్ 450ఎక్స్ (Ather 450X) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనుంది. ఏథర్ ఎనర్జీకి ఇది దేశంలో 19వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అవుతుంది మరియు దీనిని రలాస్ ఆటోకార్ప్ భాగస్వామ్యంతో ప్రారంభించారు.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

రాయ్‌పూర్‌లోని జయస్తంభ చౌక్ వద్ద ఈ షోరూమ్‌ని ప్రారంభించారు. కస్టమర్లు ఈ షోరూమ్ ని సందర్శించడం ద్వారా ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను టెస్ట్ రైడ్ చేయవచ్చు, కొనుగోలు చేయవచ్చు మరియు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ప్రస్తుత సీజన్‌ కు కస్టమర్లకు తమ స్కూటర్ యొక్క అనుభవాన్ని అందించేందుకు కంపెనీ ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించింది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

రాయ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం త్వరలో ఈవీలకు సంబంధించి అనేక పాలసీలను తీసుకురాబోతోందని, అలాగే 2025 నాటికి చాలా రవాణా వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మారుస్తుందని ఏథర్ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీసుకురాన్న కొత్త ఈవీ పాలసీలు చాలా మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఏథర్ స్పేస్ వినియోగదారులకు ప్రత్యేకమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తుంది. కస్టమర్లు ఈ షోరూమ్ లకు వెళ్లడం ద్వారా, కంపెనీ అందించే వాహనాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, సదరు ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే అన్ని భాగాలను కూడా విడివిడిగా చూపడం మరియు వాటి గురించి కస్టమర్లకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఏథర్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ (షోరూమ్) ను సందర్శించడానికి ముందు కస్టమర్లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌ ను సందర్శించి టెస్ట్ రైడ్‌ ను కూడా బుక్ చేసుకోవచ్చు. ఏథర్ ఎనర్జీ ఈ ఏడాది తమ నెట్‌వర్క్ ను గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం, ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, తిరుచ్చి, విశాఖపట్నం, జైపూర్, కోజికోడ్, ఇండోర్ మరియు నాసిక్‌లో ఏథర్ ఎనర్జీ తమ షోరూమ్‌లను ప్రారంభించింది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

కొత్త షోరూమ్ లతో పాటుగా ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కూడా పనిచేస్తోంది. రాయ్‌పూర్ విషయానికి వస్తే, జలవిహార్ కాలనీ, నయా రాయపూర్, ధమతారి రోడ్ మరియు జైస్తంభ్ చౌక్‌లలో కంపెనీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో నగరంలో మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఏథర్ యోచిస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

రాయ్‌పూర్‌లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 145,129 గా ఉంటుంది. అలాగే, ఇందులోని ఎంట్రీ లెవల్ మోడల్ ఏథర్ 450 ప్లస్ ధర రూ. 126,119 గా ఉంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్).

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఈ రెండు మోడళ్లలో అత్యంత పాపులర్ అయిన ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ 6 kW ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం సుమారు 1.45 కిలోమీటర్ల దూరం నడపడానికి అవసరమైన చార్జింగ్ లభిస్తుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఏథర్ ఎనర్జీ ఈ బ్యాటరీపై మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో అనేక స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిలో 4జి నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే పూర్తి స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు మరియు సంగీతం, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ స్టేషన్లను ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రతి నెలా కనీసం 45 ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్లను జోడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాని ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను దాదాపు 500 కి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏథర్ ఎనర్జీ వెల్లడించింది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొత్త షోరూమ్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ!

నెట్‌వర్క్ విస్తరణపై కంపెనీ భారీ దృష్టి సారించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 50 నగరాలకు, రాబోయే రెండేళ్లలో దాదాపు 100 నగరాలకు తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ప్రణాళికలలో దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా ఉంది.

Most Read Articles

English summary
Ather energy opens new showroom in raipur chhattisgarh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X