కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

ఏథర్ ఎనర్జీ (Ather Energy) భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి మరియు సరైన సమయంలో కస్టమర్లకు తమ వాహనాలు డెలివరీ చేయడానికి తమిళనాడులోని హోసూర్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ మొత్తం సామర్థ్యం ఏడాదికి 4,00,000 యూనిట్లుగా ఉంటుంది. Ather కంపెనీ 2021 అక్టోబర్ నెలలో అత్యధిక అమ్మకాలను సాధించింది. ఈ అమ్మకాలు గత సంవత్సరం కంటే 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ అమ్మకాలు క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

ఏథర్ ఎనర్జీ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఒకే ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 1,20,000 స్కూటర్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడు కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, కొత్త ప్లాంట్ త్వరలో రాబోతోంది. కావున ఆ సమయంలో కంపెనీ కస్టమర్లకు త్వరగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేస్తుంది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

Ather గత కొన్ని నెలలుగా తన ఉనికిని క్రమంగా విస్తరిస్తూనే ఉంది. నివేదికల ప్రకారం, అక్టోబరు నెలలోనే అత్యధికంగా అమ్మకాలను సాధించింది. గత నెలతో పోలిస్తే అమ్మకాల్లో ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని ఫలితంగా కంపెనీకి $100 మిలియన్ల ఆదాయం వచ్చింది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ గత నవంబర్ నుంచి ప్రతి నెలా 20 శాతం విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంగా ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా మాట్లాడుతూ, దేశంలో EVలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని, ఈ కారణంగా 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

నేడు దేశంలో అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినందున 450 ప్లస్‌కి డిమాండ్ బాగా పెరుగుతోంది. మా అనుభవ కేంద్రం వృద్ధి చెందుతూనే ఉంది మరియు రిటైల్ ఫుట్‌ప్రింట్ రాబోయే త్రైమాసికాల్లో ఆరు రెట్లు పెరగనుంది. దీనితో పాటు, మా ప్రస్తుత సదుపాయాన్ని ప్రారంభించిన 10 నెలల తర్వాత, మేము పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నాము.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశంలో అతిపెద్ద EV తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఏథర్ కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ల వల్ల 3 రెట్లు ఎక్కువ మంది మునుపటికంటే సందర్శించడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. దీనితో పాటు, టెస్ట్ రైడ్‌లలో 3 రెట్లు పెరుగుదల మరియు ఏప్రిల్ మరియు అక్టోబర్ మధ్య బుకింగ్‌లు 4 రెట్లు పెరిగాయి. కంపెనీ స్కూటర్లు 450X మరియు 450 ప్లస్ రెండూ 90 శాతం స్థానికీకరించబడ్డాయి.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐదేళ్లలో రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన కంపెనీతో పాటు లిథియం-అయాన్ బ్యాటరీలపై కూడా దృష్టి సారించనుంది. 2023 మార్చి నాటికి 100 నగరాల్లో 150 అనుభవ కేంద్రాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఏథర్ తన రిటైల్ కార్యకలాపాలను పెంచుతూ ఉంది. దీనితో పాటు, కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా మెరుగుపరుస్తుంది, దీని కారణంగా, కంపెనీ ఎక్కడ డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తుందో, అక్కడ కొన్ని కీలక ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. కంపెనీ నివేదికల ప్రకారం, గత నెలలో ఏథర్ దాదాపు 3,500 యూనిట్లను విక్రయించింది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

ఈ సందర్భంగా ఏథర్ ఎనర్జీ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు 'తరుణ్ మెహతా' మాట్లాడుతూ.. పండుగల సీజన్‌లో ఏథర్ అమ్మకాలు పెరిగాయని, అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 12 రెట్లు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ దేశంలోని 19 నగరాల్లో దాదాపు 22 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లతో ఉంది. ఇవన్నీ కూడా కస్టమర్లకు చాలా మంచి అనుభవాన్ని అందిస్తుంది.

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

భారతీయ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ ప్రారంభంలో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు శరవేగంగా ముందుకు దూసుకెలుతోంది. ఇప్పుడు ఈ స్కూటర్ వినియోగించే కస్టమర్ల సంఖ్య చాలా వరకు పెరిగింది. అయితే ఈ అమ్మకాలు ఇక రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు కంపెనీ దినదినాభివృద్దివైపు వేగంగా పరుగులు పెడుతుంది.

Most Read Articles

English summary
Ather energy to set up second plant in hosur
Story first published: Monday, November 29, 2021, 19:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X