ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ 1.0" డిజైన్‌కు పేటెంట్ లభించినట్లు కంపెనీ పేర్కొంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‍‌ను కంపెనీ అక్టోబర్ 5, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ 850 బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.55,000 లుగా ఉంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను పాతకాలపు కేఫ్-రేసర్ స్టైల్‌లో డిజైన్ చేసింది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా, మినిమలిస్టిక్‌గా ఉంటుంది. దీనిని టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‍‌లో బెస్ట్-ఇన్-క్లాస్ 14-లీటర్ స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్ ఉంటుందని మరియు స్పోర్టియర్ రైడింగ్ కోసం ఇందులో లో-స్లంగ్ హ్యాండిల్ బార్ ఉంటుందని ఆటమ్మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ వంశీ గడ్డం తెలిపారు.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 48 వోల్ట్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చబడి ఉంటుంది. ఇది పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క గరిష్టం వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఈ మోటార్‌సైకిల్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుందని, దీనిని స్టాండర్డ్ 3-పిన్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీ ఫుల్ చార్జ్ కోసం కేవలం 1 యూనిట్ విద్యుత్‌ను మాత్రమే మాత్రమే వినియోగిస్తుంది. అంటే, దీనిపై సగటున 100 కిలోమీటర్లకు కేవలం 7 నుండి 10 రూపాయల వరకూ మాత్రమే ఖర్చు అవుతుంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఈ బైక్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ, ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్స్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, పెద్ద టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ (280 మి.మీ) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డిజిటల్ డిస్‌ప్లే మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌కి పేటెంట్ మంజూరు, ధర రూ.55,000 మాత్రమే!

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‌ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) ద్వారా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్‌గా ధృవీకరించబడింది. ఈ బైక్‌కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంతేకాదు దీనిని నడపటానికి రైడర్‌కు లైసెన్స్ కూడా అవసరం ఉండదు.

Most Read Articles

English summary
Atum 1.0 Electric Bike Receives Design Patent, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X