2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

2021 మార్చి నెల ముగిసింది. ఈ నేపథ్యంలో ఆటో పరిశ్రమలోని అన్ని వాహన తయారీదారులు తమ అమ్మకాల నివేదికను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ మార్చి 2021 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. బజాజ్ ఆటో యొక్క అమ్మకాలు మార్చి నెలలో ఏవిధంగా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. రండి.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

బజాజ్ ఆటో విడుదల చేసిన అమ్మకాల నివేదికలో మార్చిలో 56 శాతం వృద్ధిని సాధించినట్లు తెలుస్తుంది. అంటే గత మార్చి నెలలో కంపెనీ మొత్తం 3,30,133 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 2,10,976 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

గత ఏడాది మార్చి నెలలో అమ్మిన 98,412 యూనిట్లతో పోలిస్తే 84 శాతం పెరుగుదలతో కంపెనీ దేశీయ మార్కెట్లో 1,81,393 యూనిట్లను విక్రయించినాట్లు అధికారికంగా తెలిపింది. ఏది ఏమైనా గత నెల మంచి అమ్మకాలతో అభివృద్ధివైపు పరుగులు తీసింది.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

ఇప్పుడు బజాజ్ ఆటో యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, గత నెలలో కంపెనీ 1,48,740 యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే గత ఏడాది మార్చిలో 1,12,564 యూనిట్లను ఎగుమతి చేసింది. గత 2021 మార్చిలో బజాజ్ బైకుల ఎగుమతులు కూడా 32 శాతం వరకు పెరిగాయి.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

గత ఏడాది అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారిని నివారయించడానికి కరోనా లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో వాహన అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులపాటు ఉత్పత్తులు మరియు అమ్మకాలు నిలిపివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లేదు కావున మార్చి నెలలో అన్ని ఆటో మొబైల్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

2020 సంవత్సరం నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక సంవత్సరం మొత్తం జరిగిన అమ్మకాల విషయానికి వస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఆటో 39,47,568 యూనిట్లను విక్రయించింది.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 36,05,893 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తంమీద, బజాజ్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 9 శాతం తగ్గాయి. అయితే ఇకపై కంపెనీ తమ అమ్మకాలను పెంచడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

ప్రస్తుతం ప్రారంభమైన 2021-2022 కొత్త ఆర్థిక సంవత్సరంలో బజాజ్ అప్‌డేట్ చేసిన పల్సర్ 220 ఎఫ్, పల్సర్ 150 మరియు పల్సర్ 250 తో సహా పలు కొత్త బైక్ మోడళ్లను విడుదల చేయనుంది. బజాజ్ కంపెనీ గత నెలలో ప్లాటినా 100 ఇఎస్ మరియు 100 సిసి ప్లాటినాను కూడా అప్డేట్ చేసింది.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

అంతే కాకుండా ఈ పల్సర్ 150, పల్సర్ 180 బైకులు కొత్త కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని సిద్ధం చేస్తుంది. బజాజ్ ఆటో కొత్త పల్సర్ 200 యొక్క టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది, ఈ బైక్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పల్సర్ 250 టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది పల్సర్ రేంజ్‌లో అత్యంత శక్తివంతమైన బైక్ కానుంది.

2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ బైక్ పండుగ సమయంలో విడుదయ్యే అవకాశం ఉంది. త్వరలో రానున్న కొత్త పల్సర్ 250 బైక్ లో సరికొత్త ఇంజిన్‌ను ఉపయోగించనుంది. పల్సర్ 250 లో ఉపయోగించే ఇంజిన్ ఎయిర్ కూల్డ్ అవుతుందని తెలుస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే ఆటో పరిశ్రమ కొంత కోలుకుంటోంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 3, 2021, 11:09 [IST]
English summary
Bajaj Bike Sales In March 2021. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+