ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

భారత ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న పల్సర్ మోటార్‌సైకిళ్లు దేశీయ మార్కెట్లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకున్నాయి. విదేశీ మార్కెట్ల నుండి వస్తున్న డిమాండ్‌తో పల్సర్ ఎగుమతులు కూడా జోరందుకున్నాయి.

ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

గడచిన డిసెంబర్ 2020 నెలలో బజాజ్ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసిన మోటార్‌సైకిళ్ల వివరాలు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, మోడల్ వారీగా అమ్మకాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

బజాజ్ ఆటో లిమిటెడ్ డిసెంబర్ 2020 నెలలో మొత్తం 1,28,642 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. కాగా, డిసెంబర్ 2019 నెలలో వీటి సంఖ్య 1,24,125 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ మొత్తం అమ్మకాలలో అత్యధికంగా పల్సర్ మోటార్‌సైకిళ్లే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

ప్రస్తుతం బజాజ్ ఆటో భారత మార్కెట్లో 7 రకాల పల్సర్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.71,616 (పల్సర్ 125) నుండి రూ.1,52,179 (ఆర్200) వరకు ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

డిసెంబర్ 2020 మొత్తం అమ్మకాల్లో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్ల దేశీయ అమ్మకాలు గత నెలలో (డిసెంబర్ 2020లో) 48.08 శాతం పెరిగి 75,421 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (డిసెంబర్ 2019లో) ఇవి 50,931 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

నవంబర్ 2020 నెలలో పల్సర్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు గణనీయంగా 1,04,904 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో పోల్చుకుంటే డిసెంబర్ 2020 నెలలో వీటి అమ్మకాలు 28.10 శాతం పడిపోయాయి. గత నెలలో పల్సర్ 125 బైక్ అమ్మకాలు మాత్రం డిసెంబర్ 2019తో పోలిస్తే 183.03 శాతం పెరిగాయి.

Pulsar Sales Dec-20 Dec-19 Growth (%) YoY
125 42,686 15,082 183.03
150 19,958 26,778 -25.47
16, 180, 200 8,279 5,223 58.51
200F 4,498 3,848 16.89
Total 75,421 50,931 48.08
Pulsar Sales Dec-20 Nova-20 Growth (%) MoM
125 42,686 56,549 -24.52
150 19,958 30,719 -35.03
160, 180, 200 8,279 10,522 -21.32
200F 4,498 7,114 -36.77
Total 75,421 1,04,904 -28.10
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

కానీ పల్సర్ 150 బైకుల అమ్మకాలు 25.47 శాతం పడిపోయాయి. అలాగే, పల్సర్ 160, 180, 200 బైక్‌ల అమ్మకాలు 58.51 శాతం, పల్సర్ 220 ఎఫ్ బైక్ అమ్మకాలు 16.89 శాతం పెరిగాయి. ఇదివరకు చెప్పినట్లుగా, 2020 డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో మొత్తం 75,421 పల్సర్ బైక్‌లు అమ్ముడయ్యాయి.

ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

ఇక పల్సర్ ఎగుమతుల విషయానికి వస్తే, డిసెంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 36,844 పల్సర్ మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది. డిసెంబర్ 2019తో పోల్చుకుంటే, గత నెలలో అన్ని పల్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు వృద్ధి బాటలోనే ఉన్నాయి.

Pulsar Exports Dec-20 Dec-19 Growth (%) YoY
160, 180, 200 15,573 13,312 16.98
150 14,043 7,008 100.39
125 4,555 2,916 56.21
200F 2,673 1,108 141.25
Total 36,844 24,344 51.35
Pulsar Exports Dec-20 Nova-20 Growth (%) MoM
160, 180, 200 15,573 14,198 9.68
150 14,043 11,112 26.38
125 4,555 5,820 -21.74
200F 2,673 1,410 89.57
Total 36,844 32,540 13.23
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!

డిసెంబర్ 2020 నెలలో బజాజ్ ఎగుమతులు ఆశించినదాని కంటే క్షీణించడానికి ప్రధానం కారణం, షిప్పింగ్ యార్డులలో కంటైనర్ల కొరతగా చెబుతున్నారు. పరిస్థితులు సద్దుమణిగితే, రానున్న నెలల్లో బజాజ్ ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Bajaj Auto December 2020 Exports Report, Model Wise Sales Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X