డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

గడచిన డిసెంబర్ 2020 నెలలో బజాజ్ ఆటో విక్రయించిన మోటార్‌సైకిళ్ల వివరాలు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, మోడల్ వారీగా అమ్మకాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో గత డిసెంబర్ నెలలో మొత్తం 1,28,642 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. మొత్తం మోటార్‌సైకిళ్ల అమ్మకాలలో బజాజ్ ఆటో 11.41 శాతం వాటాను కలిగి ఉంది.

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

గతేడాది ఇదే సమయంతో (డిసెంబర్ 2019తో) పోలిస్తే, అమ్మకాలు స్వల్పంగా 3.6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. డిసెంబర్ 2019 నెలలో బజాజ్ ఆటో మొత్తం 1,24,125 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

అయితే ఈ అమ్మకాలు గత నవంబర్ 2020 నెలతో పోలిస్తే మాత్రం 0.42 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. ఆ నెలలో మొత్తం అమ్మకాలలో బజాజ్ మోటార్‌సైకిళ్ళ వాటా 11.82 శాతంగా నమోదైంది. కంపెనీ మొత్తం అమ్మకాలలో పల్సర్ రేంజ్ బైక్‌లే అత్యధికంగా ఉన్నాయి.

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

బజాజ్ పల్సర్ రేంజ్‌లో కంపెనీ 125 సిసి, 150 సిసి, 180 సిసి, 200 సిసి, 220 సిసి విభాగాలలో మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. గత నెల మొత్తం అమ్మకాలలో 125 సిసి పల్సర్ బైక్‌లే అత్యధికంగా 42,686 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ 2019తో పోలిస్తే ఇవి 183 శాతం పెరుగుదలను చూశాయి.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

అదేవిధంగా, 180 సిసి మరియు 200 ఎన్‌ఎస్ బైక్‌ల అమ్మకాలు 8,279 యూనిట్లుగా నమోదై, డిసెంబర్ 2019తో పోలిస్తో 59 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. కాగా, పల్సర్ 220 బైక్‌ల అమ్మకాలు గత నెలలో 17 శాతం వృద్ధి చెంది 4,498 యూనిట్లుగా నమోదయ్యాయి.

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

అయితే, డిసెంబర్ 2019తో పోలిస్తే, గత నెలలో 150 సిసి పల్సర్ బైక్‌ల అమ్మకాలు మాత్రం 25 శాతం తగ్గి, 19,958 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఇదే సమయంలో ఇవి 26,778 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ:అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

బజాజ్ పల్సర్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన మోడల్ ప్లాటినం. కానీ డిసెంబర్ 2019తో పోలిస్తే మాత్రం ఈ మోడల్ అమ్మకాలు 14 శాతం తగ్గాయి. డిసెంబర్ 2019లో ఇవి 35,914 యూనిట్లుగా ఉంటే, డిసెంబర్ 2020లో 30,740 యూనిట్లుగా ఉన్నాయి.

Rank Models Dec 2020 Dec 2019 Growth (%)
1 Pulsar 125 42,686 15,082 183
2 Platina 30,740 35,914 -14
3 Pulsar 150 19,958 26,778 -25
4 CT100 13,835 30,758 -55
5 Pulsar 180 + 200NS 8,279 5,223 59
6 Pulsar 220 4,498 3,848 17
7 Avenger 160 1,333 2,112 -37
8 Avenger 220 643 402 60
9 Dominar 400 411 180 128
10 Dominar 250 364 - 7
11 Chetak Electric 3 - -
డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

ఒకప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన బజాజ్ సిటి100 బైకుల అమ్మకాలు భారీగా 55 శాతం తగ్గాయి. డిసెంబర్ 2019లో 30,758 యూనిట్లుగా ఉన్న ఈ మోడల్ అమ్మకాలు డిసెంబర్ 2020లో 13,835 యూనిట్లుగా నమోదయ్యాయి.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

డిసెంబర్ 2020లో బజాజ్ అవెంజర్ 160 అమ్మకాలు 1,333 యూనిట్లుగా నమోదై డిసెంబర్ 2019 (2,112 యూనిట్ల) అమ్మకాలతో పోలిస్తే 37 శాతం క్షీణించాయి. కాగా, అవెంజర్ 220 బైక్‌ల అమ్మకాలు 643 యూనిట్లుగా నమోదై డిసెంబర్ 2019 (402 యూనిట్లు) అమ్మకాలతో పోలిస్తే 60 శాతం వృద్ధిని సాధించాయి.

డిసెంబర్‌లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..

ఇకపోతే, బజాజ్ డొమినార్ 400 బైక్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 2020లో ఈ మోడల్ అమ్మకాలు 128 శాతం పెరిగి 411 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, కొత్తగా ప్రవేశించిన డొమినార్ 250 గత నెలలో 364 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో బజాజ్ ఆటో 3 ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Bajaj Auto December 2020 Sales Report, Model Wise Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X