ఇది విన్నారా.. బజాజ్ ఆటో ఫ్రీ సర్వీస్ ఇప్పుడు జూలై 31 వరకు
భారతదేశంలో రోజురోజుకి అధికంగా వ్యాపిస్తున్న మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే హలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు మరియు ఆటో పరిశ్రమలు ఇప్పటికి మూసివేయబడ్డాయి. కానీ వాహనదారుల సౌకర్యం కోసం అన్ని కంపెనీలు వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కూడా ఫ్రీ సర్వీస్ వ్యవధిని పొడిగించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం బజాజ్ ఆటో యొక్క ఫ్రీ సర్వీస్ టైమ్ ఏప్రిల్ మరియు మే నెలలతో ముగియనుంది. కానీ కరోనా లాక్ డౌన్ ని దృష్టిలో ఉంచుకుని ఫ్రీ సర్వీస్ వ్యవధిని 2021 జూలై 31 వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలోని వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది.

సాధారణంగా కంపెనీ ఇంతకుముందు ఇచ్చిన సమాచారం ప్రకారం ఫ్రీ సర్వీస్ వ్యవధి 2021 మే 31 నాటికి ముగుస్తుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవధిని ఏకంగా రెండు నెలల వరకు పొడిగించబడింది. కరోనా లాక్ డౌన్ 2021 ఏప్రిల్ నుండి దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది.

భారతదేశంలోని దాదాపు చాలా రాష్ట్రాల్లో చాలా కఠినమైన చర్యలు విధిస్తూ మహమ్మారి నివారణకోసం పాటుపడుతున్నారు. ఈ సమయంలో దేన్నీ దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఫ్రీ సర్వీస్ వ్యవధిని పొడిగించింది. ఈ సర్వీస్ ఒక్క రాష్ట్రం లేదా ఒక ప్రాంతానికే పరిమితం కాదు.

దేశవ్యాప్తంగా విస్తరించిన బజాజ్ ఆటో యొక్క అన్ని షోరూమ్‌ల వినియోగదారులందరికీ వర్తిస్తుంది. కావున ఇలాంటి సమయంలో ఎవరూ ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉండదు. ఈ ఫ్రీ సర్వీస్ అన్ని టూ వీలర్స్ మరియు కమర్షియల్ వాహనాలకు వర్తిస్తుంది.

ఈ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ మాట్లాడుతూ, "కోవిడ్ 19 యొక్క సెకండ్ వేవ్ కారణంగా మా కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో లాగే ఇప్పుడు కూడా ఈ సర్వీస్ రెండు నెలల పొడిగించడం జరిగింది.

ఈ క్లిష్ట సమయంలో వినియోగదారులందరికి ప్రయోజనాలను చేకూర్చుతామని కంపెనీ హామీ ఇచ్చింది. బజాజ్ ఆటో, ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా సేకోడ్ వేవ్ కారణంగా ప్రజలకు మరియు ఉద్యోగులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనితోపాటు అనేక సహాయక చర్యలు కూడా తీసుకుంటోంది.

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పై పోరాడటానికి బజాజ్ గ్రూప్ 200 కోట్ల రూపాయల గ్రాంటును ప్రకటించింది. కరోనాతో బాధపడుతున్న రోగుల ప్రాణాలను కాపాడటానికి కంపెనీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది.

ఇవి మాత్రమే కాకుండా కంపెనీ వెంటిలేటర్లు, మాస్క్‌లు, పిపిఇ కిట్లు మరియు అవసరమైన అనేక వైద్య పరికరాలను కూడా సరఫరా చేస్తోంది. అంతే కాకుండా కోవిడ్ -19 కారణంగా మరణించిన ఉద్యోగుల పిల్లల చదువుకు కూడా నిధులు ఇవ్వబడతాయి. సంస్థ ఇచ్చే వైద్య బీమాను కూడా డిపెండెంట్లకు ఐదేళ్ల వరకు పొడిగిస్తామని పూణేకు చెందిన బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా నివారణకోసం పాటుపడుతున్న భారతదేశానికి తమ వంతు అండగా బజాజ్ ఆటో ముందుకు వచ్చింది. ఇందులో భాగాంగానే ప్రజలకు చాలా వరకు సహాయక చర్యలు అందిస్తోంది. కరోనా కష్టకాలంలో బజాజ్ ఆటో చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం.


Click it and Unblock the Notifications








