మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

భారత మార్కెట్లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల తన సిరీస్‌లోని అన్ని బైక్‌ల ధరలను పెంచింది. అయితే ఇప్పుడు కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, తన ఎంట్రీ లెవల్ బైకులైన బజాజ్ సిటి 100 మరియు బజాజ్ ప్లాటినా ధరలను పెంచింది.

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

బజాజ్ కంపెనీ ఈ బైకుల ధరలను 749 రూపాయల నుండి 1,696 వరకు పెంచింది. బజాజ్ సిటి 100 కిక్ స్టార్ట్ వేరియంట్‌ ధరను రూ. 1,498 వరకు పెంచింది. ధరల పెరుగుదల తర్వాత బజాజ్ సిటి 100 కిక్ స్టార్ట్ వేరియంట్‌ ధర రూ. 49,152 (ఎక్స్‌షోరూమ్). ధరల పెరుగుదలకు ముందు ఈ బైక్ ధర రూ. 47,654.

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

సిటి 100 యొక్క ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధరను ఇప్పుడు 1,696 రూపాయలు వరకు పెంచారు. ధరల పెరుగుదల తర్వాత సిటి 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర 53,498 రూపాయలకు చేరింది. ఇంతకు ముందు ఈ బైక్‌ను 51,802 రూపాయల ధరల మార్కెట్లో విక్రయించారు.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

ఇవి మాత్రమే కాకుండా కంపెనీ బజాజ్ సిటి 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ అల్లాయ్ ఎక్స్ ధర 1,356 రూపాయలు పెరగటం వల్ల, ఇప్పుడు దీని ప్రస్తుత ధర 55,494 రూపాయలకు చేరుకుంది. ఈ బైక్‌ను కంపెనీ గతంలో 54,138 రూపాయల ధరలకు విక్రయించింది. బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ అల్లాయ్ ధర ఇప్పుడు రూ. 749 వరకు పెరిగింది. ఇప్పుడు ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో 52,915 రూపాయలు.

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది
Model New Price Old Price Difference
CT100 KS Alloy ₹49,152 ₹47,654 ₹1,498
CT110 ES Alloy ₹53,498 ₹51,802 ₹1,696
CT110 ES Alloy X ₹55,494 ₹54,138 ₹1,356
Platina 100 KS Alloy ₹52,915 ₹52,166 ₹749
Platina 100 ES Drum ₹54,669 ₹53,920 ₹749
Platina 110 5-speed Drum ₹60,608 NA NA
Platina 110 H-Gear Disc ₹63,424 ₹64,301 - ₹877
Platina 110 ES ABS ₹67,424 ₹65,920 ₹1,504

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

ఇప్పుడు బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ విషయానికి వస్తే, దీని ధర కూడా 749 రూపాయలు పెరిగింది. ఇంతకు ముందు ఇది 53,920 రూపాయల ధరలకు అమ్ముడైంది, ఇప్పుడు దీని ప్రస్తుత ధర 54,669 రూపాయలు.

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

ఇది కాకుండా, ప్లాటినా 110 5-స్పీడ్ డ్రమ్ వేరియంట్ ధరలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు, కావున దీనిని రూ .60,608 ధరలకు విక్రయిస్తున్నారు. ధరల పెరుగుతున్న సమయంలో ప్లాటినా 110 హెచ్-గేర్ డిస్క్ వేరియంట్ పై మాత్రం 877 రూపాయల వరకు తగ్గటం వల్ల, ఇప్పుడు ఈ బైక్ ధర 63,424 రూపాయలు.

MOST READ:పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

ఈ సమయంలో కంపెనీ తన ప్లాటినా 110 ఎలక్ట్రిక్ స్టార్ట్ ఎబిఎస్ ధరను 1,504 రూపాయల వరకు పెంచింది. కావున ఈ వేరియంట్ ధర తాజాగా 67,424 రూపాయలకు చేరింది. దీని ధర ధరల పెరుగుదలకు ముందు ఎక్స్-షోరూమ్ ప్రకారం 65,920 రూపాయలు.

Most Read Articles

English summary
Bajaj Auto India Increases Price Of CT100 And Platina Range. Read in Telugu.
Story first published: Saturday, April 10, 2021, 14:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X