కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

2021 అక్టోబర్ నెల ముగిసింది. అయితే దేశీయ మార్కెట్లో చాలామంది వాహన తయారీదారులు ఈ సందర్భంగా 2021 అక్టోబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేశాయి. ఇందులో భాగంగానే ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు బజాజ్ ఆటో (Bajaj Auto) తన అమ్మకాల నివేదికను విడుదల చేసింది. బజాజ్ ఆటో అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, Bajaj Auto దేశీయ మార్కెట్లోని తన అమ్మకాలలో 26 శాతం క్షీణతను నమోదు చేశాయి. బజాజ్ ఆటో గత అక్టోబర్‌లో 1,98,738 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కానీ గత ఏడాది ఇదే అక్టోబర్ నెలలో కంపెనీ మొత్తం 2,68,631 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెలలో కంపెనీ 26 శాతం తగ్గుదలను నమోదు చేసినట్లు తెలుస్తుంది.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

అయితే కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, గత నెలలో బజాజ్ కంపెనీ కంపెనీ భారతదేశం నుండి 1,92,565 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. అక్టోబర్ 2020లో ఇది 2,01,659 యూనిట్లను ఎగుమతి చేయగలిగింది. ఈ నివేదికల ప్రకారం ఎగుమతుల విషయంలో కూడా కంపెనీ 5 శాతం క్షీణతను నమోదు చేసింది.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

కంపెనీ గత నెలలో బైకులు మరియు స్కూటర్ల విభాగంలో తగ్గుదలను నమోదు చేసినప్పటికీ, కమర్షియల్ వాహనాల విభాగంలో మెరుగైన పనితీరు కనబరిచింది. 2021 అక్టోబర్ నెలలో కంపెనీ దేశంలో 19,827 యూనిట్ల కమర్షియల్ వాహనాలను విక్రయించగలిగింది. కంపెనీ నివేదికల ప్రకారం కమర్షియల్ వాహనాల అమ్మకాలలో 58% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ ఉన్నప్పటికి కూడా అమ్మకాలు ఏ మాత్రం వృద్ధిని కనపరచలేదు. అయితే రానున్న దీపావళి సమయంలో ఏమైనా వృద్ధి చెందే అవకాశం ఉందేమో వేచి చూడాలి. మొత్తానికి దసరా సీజన్ బజాజ్ ఆటో కంపెనీకి కలిసిరాలేదనే చెప్పాలి.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

భారతీయ మార్కెట్లో Bajaj Auto (బజాజ్ ఆటో) ఇటీవల రెండు సరికొత్త Bajaj Pulsar (బజాజ్ పల్సర్) బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి Pulsar N250 బైక్ కాగా, మరొకటి Pulsar F250. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే విధంగా Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

Bajaj కంపెనీ తన మొదటి బజాజ్ పల్సర్‌ను 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చింది, అయితే ఇప్పుడు కంపెనీ ఈ బ్రాండ్‌ను కొత్త అవతార్‌లో తీసుకువచ్చింది. ఈ రెండు బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త Bajaj Pulsar 250 బైకులు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటాయి.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

కొత్త Bajaj Pulsar 250 బైక్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది.

ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

Bajaj Pulsar యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, కావున ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

కలిసిరాని పండుగ సీజన్: పతనమైన Bajaj Auto అక్టోబర్ 2021 సేల్స్

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ 250 సిసి బైకులు Yamaha FZ25, Suzuki Gixxer SF250, KTM 250 Duke మరియు Husqvarna Vitpilen 250 వంటి వాటికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ బైక్ కంపెనీ యొక్క అమ్మకలకు ఏ విధంగా సహాయపడుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, November 1, 2021, 15:16 [IST]
English summary
Bajaj auto october sales 198738 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+