బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం మొదలైపోయింది. ఇందులో భాగంగానే చాలా వాహన తయారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేసి అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. వాహన వినియోగదారులు కూడా ఇప్పుడు ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ కారణంగానే కంపెనీలు కూడా మార్కెట్లో తమ ఉనికిని చాటుకోవడానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

టీవీఎస్ మోటార్ కంపెనీ కొంతకాలం క్రితం తన ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది, ఇదే విధంగా మరియు ఇప్పుడు బజాజ్ ఆటో కూడా ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ఈ రెండు సంస్థలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించాయి.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను చేర్చడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కి తెలియజేసింది. పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది, అంతే కాకుండా రెండు, మూడు మరియు నాలుగు చక్రాల శ్రేణిలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను తయారు చేయడానికి కంపెనీకి సహాయపడుతుందని కూడా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

ఇవన్నీ కూడా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి ఉంటుందని కంపెనీ ప్రస్తావించింది. ఈ అనుబంధ సంస్థకు మూలధనం రూ. 100 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీని గురించి సమాచారం కంపెనీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే కొత్త అనుబంధ సంస్థ చకన్‌లో నిర్మిస్తున్న సంస్థ యొక్క కొత్త ఉత్పాదక కర్మాగారంలో ఎలక్ట్రిక్ కెటిఎమ్ మరియు హస్క్ వర్ణాలను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

బజాజ్ కంపెనీ తీసుకున్న నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల బజాజ్ ఆటో తన లక్ష్యాలను మరియు ప్రాజెక్టులను మునుపటి కంటే మెరుగ్గా క్రమబద్ధీకరించగలిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన వనరుల కేటాయింపును కూడా మరింత సులభతరం చేస్తుంది.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

బజాజ్ ఆటో యొక్క ఈ ప్రాజెక్ట్ తరువాత, త్వరలో కంపెనీ పల్సర్ బైక్ ను ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. పల్సర్ వాహనాలు ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో మంచి ఆదరణ పొందటం వల్ల, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా బాగా ఆదరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

ఇదిలా ఉండగా టీవీఎస్ మోటార్ తన కొత్త యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కింద, హై పర్ఫామెన్స్ మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇటువంటి పరిస్థితిలో బజాజ్ పల్సర్ మరియు టివిఎస్ అపాచీల మధ్య మంచి పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కొత్త యూనిట్ ఏర్పాటు కానుందా?

ప్రస్తుత కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో ప్రజాదరణ పొందిన బైకులు మరింత అప్డేటెడ్ ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ వాహనాలుగా విడుదలైతే కంపెనీల యొక్క అమ్మకాలు కూడా జోరుగా సాగుతాయి.

Most Read Articles

English summary
Bajaj Auto Plans Set Up A Separate Unit For Electric Vehicles. Read in Telugu.
Story first published: Monday, July 26, 2021, 17:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X