అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్ బ్రాండ్ పల్సర్ (Pulsar) లో కంపెనీ తాజాగా రెండు సరికొత్త 250సిసి ఇంజన్ మోడళ్లు ఎన్250 మరియు ఎఫ్250 లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త మోడళ్లను విడుదల చేయడంతో పాటుగా కంపెనీ తమ పల్సర్ రేంజ్ మోటార్‌సైకిల్ లైనప్ లో కొన్ని మార్పులు కూడా చేయనుంది.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న కొన్ని రకాల పల్సర్ మోటార్‌సైకిళ్లను డిస్‌కంటిన్యూ చేసి వాటి స్థానంలో కొత్త రిఫ్రెష్డ్ మోడళ్లను ప్రవేశపెట్టనుంది. అలాగే, ప్రస్తుత పల్సర్ లైనప్ లోని మరికొన్ని మోడళ్లను రిఫ్రెష్డ్ డిజైన్ మరియు పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ పై తయారు చేయనుంది. ఇటీవల కొత్త బజాజ్ పల్సర్ 250 బైక్ లను విడుదల చేసిన సందర్భంగా, బజాజ్ ఆటో తమ ప్రస్తుత శ్రేణి పల్సర్ మోటార్‌సైకిళ్లను నిలిపివేస్తున్నట్లు మరియు రాబోయే నెలల్లో వాటిని కొత్త తరానికి అప్‌డేట్ చేయనున్నట్లు ప్రకటించింది.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

బజాజ్ ఆటో ప్రస్తుతం పల్సర్ సిరీస్ లో 125సిసి ఇంజన్ మొదలుకొని 250సిసి ఇంజన్ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో పల్సర్ 125, 150, 180, 220F, NS125, NS160, NS200 and RS200 మోడళ్లు ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు ఈ మోడళ్లను కొత్త ప్లాట్‌ఫామ్ తో అప్‌డేట్ చేయనుంది. వీటిలో మొదటగా 125 సిసి మరియు 150 సిసి మోడళ్లు అప్‌డేట్ లను పొందే అవకాశం ఉంది. కేవలం ప్లాట్‌ఫామ్ లో మార్పు మాత్రమే కాకుండా, కొత్త ఫీచర్లు మరియు కొత్త ఇంజన్ ఆప్షన్లు కూడా వీటిలో ఆశించవచ్చు.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

బజాజ్ పల్సర్ శ్రేణి మోటార్‌సైకిళ్లు భారతదేశపు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఇవి ఈ బ్రాండ్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా నిలిచాయి. బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు పెరగడంలో కూడా పల్సర్ మోడళ్లు కీలకంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో, మారుతున్న మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా మరియు విభిన్న కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా బజాజ్ ఆటో తమ పల్సర్ మోడళ్లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

పూనేకి చెందిన ఈ కంపెనీ గత కొంతకాలంగా తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన చిన్న పల్సర్ మోడళ్లలో కొత్త తరం మోడళ్లను తీసుకువచ్చే అంశంపై పని చేస్తోంది, వచ్చే ఏడాదిలో కొత్త తరం పల్సర్ మోడళ్లను మనం చూసే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్ లు రిఫ్రెష్డ్ డిజైన్, సరికొత్త ఛాసిస్ మరియు అప్‌డేటెడ్ ఇంజన్‌ తో తీసుకురావచ్చని సమాచారం. వీటిలో కొత్త సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటుగా పలు ఇతర కొత్త ఫీచర్లను కూడా ఆశించవచ్చు.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

బజాజ్ ఆటో ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో ఇప్పటికే డొమినార్ బైక్ ను 250 సిసి మరియు 400 సిసి ఇంజన్ సామర్థ్యాలతో విక్రయిస్తున్న నేపథ్యంలో, తమ పల్సర్ బైక్ కేవలం 250 సిసికి మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది. లగ్జరీ మోటార్‌సైకిళ్ల అభివృద్ది కోసం బ్రిటన్ కి చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్‌తో కలిసి బజాజ్ ఆటో కొత్త బైక్‌లను కూడా సిద్ధం చేస్తోంది. వీటిని రెండు బ్రాండ్ల క్రింద విక్రయించే అవకాశం ఉంది.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

కొత్త బజాజ్ పల్సర్ 250 (Bajaj Pulsar 250) ఎలా ఉంది..?

బజాజ్ ఇటీవలే విడుదల చేసిన పల్సర్ 250 మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, ఇవి ప్రస్తుత పల్సర్ బైక్ ల కన్నా కొత్త డిజైన్ ను కలిగి ఉండి, కొత్త అవతార్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కంపెనీ వీటిని ట్యూబ్‌లెస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించింది. ఫలితంగా, ఇవి చాలా ఏరోడైనమిక్‌ రూపాన్ని కలిగి ఉంటాయి. ఈ మోటార్‌సైకిళ్లలో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్, స్టైలిష్ డిజైన్, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులతో ఇది ముందు వైపు నుండి మంచి అగ్రెసివ్ లుక్ ని కలిగి ఉంటుంది.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

ఇక వీటిలోని ఫీచర్ల విషయానికి వస్తే, టాకోమీటర్ మీటర్ కన్సోల్ పాత మోడల్ నుండే తీసుకోబడింది మరియు ఇందులో డిజిటల్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ పై రేంజ్, గేర్ స్థానం, డిస్టన్స్ టూ ఎంప్టీ మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. ఇంకా ఇందులో మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం యూఎస్‌బి స్లాట్ కూడా ఉంటుంది. ఈ బైక్‌లో 14 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది, సీటు ఎత్తు 795 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీగా ఉంటుంది.

అన్ని రకాల Pulsar మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేయనున్న Bajaj.. ఈసారి కొత్తగా ఏముంటుందో..?

ఇంజన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ బైక్‌లలో 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించింది, ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి శక్తిని మరియు 21.5 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలీస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంచాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

Most Read Articles

English summary
Bajaj auto plans to update pulsar motorcycle range soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X