బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్, గతేడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' కోసం ఇప్పుడు 50,000 మందికి పైగా కస్టమర్లు వేచిస్తున్నారు. ఈ మోడల్ కోసం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

జనవరి 2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ మోడల్‌ను పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత దీనిని దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేయాలన్ని కంపెనీ ప్లాన్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

కోవిడ్-19 మహమ్మారి కారణంగా బజాజ్ ఆటో తమ చేతక్ స్కూటర్ విస్తరణ ప్రణాళికను వాయిదా వేసుకుంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో, కంపెనీ తిరిగి తమ ప్రణాళికను అమలు చేస్తోంది. రానున్న రోజుల్లో కొత్తగా 28 నగరాల్లో ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

కరోనా కారణంగా ఏర్పడిన ఉత్పత్తి అంతరాయాన్ని తాము ఇప్పుడిప్పుడే అదిగమిస్తున్నామని, త్వరలోనే మరిన్ని కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ స్కూటర్ కోసం ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 50,000 లకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని ఆయన అన్నారు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

ప్రస్తుతం భారత మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'అర్బన్' ధర రూ.1 లక్షగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'ప్రీమియం' ధర రూ.1.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంపిక చేసిన నగరాల్లో బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

బజాజ్ ఆటో సంస్థకు మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన చేతక్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీని 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది చూడటానికి రెట్రో-మోడ్రన్ స్టైల్ స్కూటర్‌లా అనిపిస్తుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..

ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Auto Has Received Over 50,000 Registrations For Its Chetak Electric Scooter In India. Read in Telugu.
Story first published: Tuesday, January 26, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X