Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- News
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్, గతేడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' కోసం ఇప్పుడు 50,000 మందికి పైగా కస్టమర్లు వేచిస్తున్నారు. ఈ మోడల్ కోసం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

జనవరి 2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ మోడల్‌ను పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత దీనిని దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేయాలన్ని కంపెనీ ప్లాన్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసింది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా బజాజ్ ఆటో తమ చేతక్ స్కూటర్ విస్తరణ ప్రణాళికను వాయిదా వేసుకుంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో, కంపెనీ తిరిగి తమ ప్రణాళికను అమలు చేస్తోంది. రానున్న రోజుల్లో కొత్తగా 28 నగరాల్లో ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

కరోనా కారణంగా ఏర్పడిన ఉత్పత్తి అంతరాయాన్ని తాము ఇప్పుడిప్పుడే అదిగమిస్తున్నామని, త్వరలోనే మరిన్ని కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ స్కూటర్ కోసం ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 50,000 లకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'అర్బన్' ధర రూ.1 లక్షగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'ప్రీమియం' ధర రూ.1.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంపిక చేసిన నగరాల్లో బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

బజాజ్ ఆటో సంస్థకు మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన చేతక్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీని 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది చూడటానికి రెట్రో-మోడ్రన్ స్టైల్ స్కూటర్‌లా అనిపిస్తుంది.

ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.