లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, గడచిన మే 2021 నెల అమ్మకాలలో మూడంకెల వృద్ధిని సాధించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు కొనసాగుతున్నప్పటికీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొనుగోలుదారులు వ్యక్తిగత రవాణా వైపు మొగ్గు చూపడంతో టూవీలర్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి.

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో గడచిన మే 2021 నెలలో మొత్తం 60,342 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 39,286 యూనిట్లుగా ఉండి 54 శాతం వృద్ధి కనబరచాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో మొత్తం 1,80,212 ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది, గత ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 73,512 యూనిట్లుగా ఉండి, 145 శాతం వృద్ధిని నమోదు చేసింది.

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

దేశీయ మరియు అంతర్జాతీ అమ్మకాల సంఖ్యలను కలిపి చూస్తే, బజాజ్ ఆటో గడచిన మే నెలలో మొత్తం 2,40,554 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మే 2020) కంపెనీ మొత్తం అమ్మకాలు 1,12,798 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మొత్తం అమ్మకాలు 113 శాతం వృద్ధిని సాధించాయి.

MOST READ:డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, బజాజ్ ఆటో మే 2020లో మొత్తం 788 యూనిట్లను విక్రయించగా, మే 2021లో మొత్తం 488 యూనిట్లను విక్రయించింది. ఈ విషయంలో మాత్రం కంపెనీ అమ్మకాలు 38 శాతం క్షీణించాయి. మరోవైపు, కంపెనీ గత నెలలో 30,820 యూనిట్ల వాణిజ్య వాహనాలను ఎగుమతి చేయగా, అంతకు ముందు ఇవి 13,542 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో వాణిజ్య వాహనాల ఎగుమతులు మాత్రం 128 శాతం వృద్ధిని సాధించాయి.

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

గత నెలలో మొత్తం వాణిజ్య వాహనాలను కలిపి చూస్తే (దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు), ఇవి 31,308 యూనిట్లుగా ఉన్నాయి. మే 2020 లో ఇవి 14,330 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మొత్తం వాణిజ్య వానాల అమ్మకాలు 118 శాతం వృద్ధిని సాధించాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

కంపెనీ యొక్క మొత్తం ద్విచక్ర వాహనాలు మరియు మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలను రెండింటిని కలిపి చూస్తే, కంపెనీ గత నెలలో మొత్తం 2,71,862 వాహనాలను విక్రయించింది. కాగా, మే 2020 లో కంపెనీ మొత్తం వాహనాల అమ్మకాలు 1,27,128 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు 114 శాతం వృద్ధిని కనబరచాయి.

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

బజాజ్ టూవీలర్ ఎగుమతుల్లో పల్సర్, ప్లాటినా మోటార్‌సైకిళ్లు కీలక పాత్ర పోషించాయి. ఏదేమైనప్పటికీ, మే 2020 నెలలో మొదటి అర్థ భాగం దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ ఉన్న సంగతి తెలిసినదే. కాబట్టి, గతేడాది మే నెలతో ఈ ఏడాది మే నెల అమ్మకాలను పోల్చడం సరైనది కాదనేది మా అభిప్రాయం.

MOST READ:హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

లాక్‌డౌన్‌లో కొనసాగిన బజాజ్ జోరు; టూవీలర్ అమ్మకాలలో 113 శాతం వృద్ధి!

ఇదిలా ఉంటే, కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో బజాజ్ ఆటో తమ టూవీలర్స్‌పై ఫ్రీ సర్వీస్ వ్యవధిని జూలై 31, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ మరియు మే నెలతో గడువు ముగిసిన వాహనాల ఫ్రీ సర్వీస్‌ను వచ్చే నెలాఖరు వరకు పొడగించాలని కంపెనీ నిర్ణయించింది.

Most Read Articles

English summary
Bajaj Auto Registers 113 Percent Sales Growth In May 2021, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X