Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొత్త సంవత్సరం ప్రారంభంలో బజాజ్ అమ్మకాల హవా..
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో జనవరి 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, బజాజ్ ఆటో గత నెలలో మొత్తం 3,84,936 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది కంపెనీ 16 శాతం ఎక్కువ అమ్మకాలను చేపట్టింది.
బజాజ్ ఆటో యొక్క విడుదల చేసిన ఈ నివేదికలో అమ్మకాలు దేశీయ మార్కెట్ మరియు విదేశీ ఎగుమతులతో కలిపి ఉంది. కంపెనీ గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది జనవరిలో బజాజ్ ఆటో దేశీయ మార్కెట్ మరియు ఎగుమతులతో సహా మొత్తం 3,32,342 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
కానీ 2021 జనవరి నెలలో కంపెనీ 1,57,404 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఒక్క దేశీయ మార్కెట్లో విక్రయించగా, కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 1,57,796 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ కొత్త సంవత్సరంలో కూడా దాదాపు దేశీయ అమ్మకాలలో పెద్దగా తేడా లేదు.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!
అయితే కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాల ఎగుమతుల విషయానికి వస్తే గత నెలలో బజాజ్ ఆటో 2,27,532 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. కాగా, గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1,74,546 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసిందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది కొత్త సంవత్సరంలో కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏకంగా 30 శాతం పెరిగాయి. అమ్మకాలు ఇది వరకు ఎన్నడూ లేని విధంగా గణనీయంగా ఎగుమతులు పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఇవి కాకుండా, బజాజ్ ఆటో యొక్క వాణిజ్య వాహనాలు కూడా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి.
MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు
కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం బజాజ్ ఆటో వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నెలలో 35 శాతం తగ్గాయని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ మరియు ఎగుమతులతో సహా 2021 జనవరిలో కంపెనీ మొత్తం 40,263 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
గత ఏడాది ఇదే జనవరి నెలలో కంపెనీ దేశీయ మార్కెట్, ఎగుమతులతో సహా 62,131 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. బజాజ్ గత నెలలో 13,353 యూనిట్ల వాణిజ్య వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించగా, కంపెనీ గత ఏడాది 35,076 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో
గత నెలలో కంపెనీ 26,910 యూనిట్ల వాణిజ్య వాహనాలను ఎగుమతి చేయగా, 2020 జనవరిలో 27,055 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. వాణిజ్య వాహనాల దేశీయ అమ్మకాలు 62% తగ్గాయి మరియు ఎగుమతులు 1% తగ్గాయి.
ఇక కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, గత నెలలో 4,25,199 వాహనాలను విక్రయించింది. దీనితో సంస్థ యొక్క అమ్మకాలు 8 శాతం పెరిగాయి. జనవరి 2020 లో కంపెనీ మొత్తం 3,94,473 యూనిట్ వాహనాలను విక్రయించింది. ఏది ఏమైనా బజాజ్ ఆటో ఈ కొత్త సంవత్సరం గణనీయమైన పురోగతిని చూస్తోంది.
MOST READ:2021 కేంద్ర బడ్జెట్లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు