అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) 2021 నవంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, బజాజ్ ఆటో మొత్తం 3,79,276 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. గత ఏడాది అమ్మకాల కంటే ఈ ఏడాది ఇదే నెల అమ్మకాలు 10% క్షీణించాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలు 4,22,240 యూనిట్లు.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, బజాజ్ యొక్క ద్విచక్ర వాహనాల విక్రయాలు దేశీయ మార్కెట్లో మునుపటికంటే కూడా 23 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ 2021 నవంబర్ నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,44,953 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. గత సంవత్సరం ఇదే నవంబర్ నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మొత్తం 1,88,196 యూనిట్లు.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

ఇక కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, ఎగుమతుల్లో కూడా కంపెనీ 2% తగ్గుదలను నమోదు చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 1,93,520 యూనిట్లను ఎగుమతి చేసింది. ఎగుమతులు మరియు దేశీయ అమ్మకాలు మొత్తం 2021 నవంబర్ నెలలో 3,38,473 యూనిట్లు. ఇది నవంబర్ 2020లో 384,993 యూనిట్ల అమ్మకాల కంటే 12 శాతం తక్కువ.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

ద్విచక్ర వాహన అమ్మకాల తరువాత, కమర్షియల్ వెహికల్ విభాగంలో బజాజ్ ఆటో మంచి అమ్మకాలను నమోదు చేయగలిగింది. కంపెనీ 2021 నవంబర్ నెలలో దేశీయ విపణిలో 13,802 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు 2020 నవంబర్ నెలలో కంపెనీ 10,737 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కావున కమర్షియల్ వెహికల్ విభాగంలో కంపెనీ 29% వృద్ధిని నమోదు చేయగలిగింది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

అదే సమయంలో కమర్షియల్ వాహనాల ఎగుమతుల విషయానికి వస్తే, బజాజ్ ఆటో 2021 నవంబర్ నెలలో 27,001 యూనిట్లను ఎగుమతి చేసింది. అదే 2020 నవంబర్ నెలలో 26,510 యూనిట్లలను ఎగుమతి చేసింది. నవంబర్ 2021లో కంపెనీ మొత్తం 40,803 యూనిట్ల వాణిజ్య వాహనాల విక్రయాలను నమోదు చేసి, మునుపటికంటే కూడా 10 శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

ఇదిలా ఉండగా, ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, బజాజ్ ఆటో త్వరలో తన పల్సర్ శ్రేణిని కొత్త అప్‌డేట్‌లతో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ పల్సర్ మోడల్స్ డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మోడళ్లను నిలిపివేసి కొత్త మోడళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో 125 సీసీ, 150 సీసీ మోడళ్లను ముందుగా అప్‌డేట్ చేసుకోవచ్చని, వాటితో పాటు కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఇందులో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

బజాజ్ ఆటో ఇటీవల పల్సర్ యొక్క రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి బజాజ్ N250 కాగా, మరొకటి బజాజ్ F250. పల్సర్ N250 అనేది నేక్డ్ రోడ్‌స్టర్ బైక్ అయితే, పల్సర్ F250 అనేది సెమీ ఫెయిర్డ్ స్పోర్టీ కమ్యూటర్ బైక్. పల్సర్ N250 భారతదేశంలోని 250 సిసి కమ్యూటర్ సెగ్మెంట్‌లో బజాజ్ డామినార్ 250 కి ప్రత్యర్థిగా ఉంటుంది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే విధంగా Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ రెండు బైకులు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

కొత్త Bajaj Pulsar 250 బైక్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది.

అంతే కాకుండా ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

Bajaj Pulsar యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, కావున ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Bajaj Auto: నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయంటే?

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 1, 2021, 16:28 [IST]
English summary
Bajaj auto sales november 379276 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+