కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తమ పాపులర్ పల్సర్ (Pulsar) సిరీస్ లో తాజాగా పల్సర్ ఎన్250 (Pulsar N250) మరియు పల్సర్ ఎఫ్250 (Pulsar F250) రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఇవి రెండూ ఇప్పుడు పల్సర్ సిరీస్ లోనే అత్యంత శక్తివంతమైన, పెద్ద ఇంజన్ తో కూడిన మోటార్‌సైకిళ్లు. ఇవి రాక ముందు వరకూ ఈ సిరీస్ లో 220ఎఫ్ (Pulsar 220F) మోడల్ పెద్ద పల్సర్ బైక్ గా ఉండేది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

బజాజ్ ఆటో తమ పల్సర్ 220ఎఫ్ సెమీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ ను తొలిసారిగా 2007 లో భాతరత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అప్పట్లో ఇదొక స్ట్రీట్ స్టార్ గా ఉండేది. ఫ్యూయల్ ఇంజెక్షన్, ఆయిల్ కూల్డ్ ఇంజన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆధునిక స్టైలింగ్‌ వంటి అనేక కొత్త ఫీచర్లతో ఇది ఆ సమయంలో కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంది. అయితే, కాలక్రమేనా కొనుగోలుదారుల అభిరుచికి మరియు ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా కంపెనీ ఈ మోడల్ ని అప్‌డేట్ చేయలేకపోయింది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

ఫలితంగా, బజాజ్ పల్సర్ 220ఎఫ్ (Bjaja Pulsar 220F) అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ ఈ బైక్ కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. దీంతో, 14 ఏళ్ల పల్సర్ 220ఎఫ్ ప్రయాణం త్వరలోనే ముగియబోతోంది. ఈ మోటార్‌సైకిల్ యొక్క చివరి బ్యాచ్ ఇప్పటికే బజాజ్ డీలర్‌షిప్‌లలో విక్రయించబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం, బజాజ్ పల్సర్ 220ఎఫ్ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా), గా ఉంది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

కంపెనీ వద్ద మరియు డీలర్‌షిప్ ల వద్ద స్టాక్స్ పూర్తిగా ఖాలీ అయ్యే వరకు మాత్రమే బైక్ అందుబాటులో ఉంటుంది. ధర పరంగా పోల్చి చూస్తే, కొత్త బజాజ్ పల్సర్ ఎఫ్250 మరియు పల్సర్ ఎన్250 మోడళ్ల కంటే, ఈ పల్సర్ 220ఎఫ్ ధర వరుసగా రూ. 4,000 మరియు రూ. 6,000 మాత్రమే తక్కువగా ఉంటుంది. బజాజ్ పల్సర్ 220ఎఫ్ మోడల్ ని 2007లో ప్రారంభించబడినప్పుడు, ఇది దాని సెమీ ఫెయిరింగ్, అగ్రెసివ్ స్టైలింగ్ మరియు లైట్ మోటార్‌తో స్పోర్టీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో గొప్ప పురోగతి సాధించింది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ యొక్క సామర్ధ్యం కారణంగా, ఇది భారతీయ మోటార్‌సైకిల్ విభాగంలో రోజువారీ రైడ్‌ల నుండి ఉత్తేజకరమైన వారాంతపు రైడ్‌ల వరకు అద్భుతమైన బైక్ గా మారింది. అయితే, ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, పల్సర్ 220ఎఫ్ దాని సహచరులతో పోటీ పడలేకపోతోంది. బజాజ్ ఆటో ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పటికీ పెద్ద ఫలితం లేకపోయింది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

కానీ, బజాజ్ 2008 లో ఈ బైక్ ధరలను తగ్గించడానికి తిరిగి కార్బ్యురేటర్‌కి మారింది. అయితే, ఇటీవల అమల్లోకి వచ్చిన కఠినమైన BS-VI కాలుష్య ప్రమాణాల నేపథ్యంలో, బజాజ్ ఆటో తిరిగి ఈ బైక్ విషయంలో ఫ్యూయల్ ఇంజెక్షన్‌ కు మారాల్సి వచ్చింది. ప్రస్తుత బజాజ్ పల్సర్ 220ఎఫ్ మోడల్ లో 220 సిసి DTS-i ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 20.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.55 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ బరువు 155 కిలోలు మరియు ఇది గరిష్టంగా లీటరుకు 40 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఏబిఎస్ మరియు డాగర్ ఎడ్జ్ ఎడిషన్ అనే రెండు వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ ఇంస్ట్రుమెంటేషన్ క్లస్టర్ లో కొత్త బ్యాక్‌లిట్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది మొదట్లో పరిచయం చేసిన అంబర్ నుండి కూల్ బ్లూ షేడ్‌కు బదులుగా ఉంటుంది.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

బజాజ్ పల్సర్ 220ఎఫ్ వెర్షన్‌లోని ఇతర డిజైన్ హైలైట్‌ లలో కొత్త డ్యూయల్-టోన్ స్కీమ్, క్రోమ్ తో కూడిన మ్యాట్-బ్లాక్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్, కొత్త రిమ్ డెకాల్స్ మరియు క్రోమ్ హైలైట్‌ మొదలైనవి ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, లేజర్ ఎడ్జ్ గ్రాఫిక్స్‌ తో కూడిన సెమీ ఫెయిరింగ్, 15 లీటర్ల ఇంధన ట్యాంక్‌ మరియు ట్యాంక్ పై 3D 'పల్సర్' లోగో, స్ప్లిట్ సీట్లు, ఇంజన్ కూల్, బ్లాక్-అవుట్ ఇంజన్, బల్కీ ఎగ్జాస్ట్ మరియు డ్యూయెల్ ఎల్‌ఈడి టెయిల్‌లైట్‌లు మొదలైనవి ఉన్నాయి.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

మెకానికల్స్ ను గమనిస్తే, ఈ పల్సర్ బైక్ సస్పెన్షన్ పనులను నిర్వహించడానికి ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు సర్దుబాటు చేయగల నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్ లు ఉంటాయి. ఈ బైక్ కి రెండు వైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వాటిలో ముందు వైపు వీల్ పై 280 మిమీ డిస్క్ మరియు వెనుక వీల్ పై 230 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ సింగిల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

కొత్త మోడళ్ల రాకతో Pulsar 220F మోడల్‌ని డిస్‌కంటిన్యూ చేయనున్న Bajaj!

బజాజ్ ఆటో ప్రస్తుతం భారత మార్కెట్లో తమ పల్సర్ సిరీస్ లో విభిన్న ఉత్పత్తులను విక్రయిస్తోంది. వాటిలో పల్సర్ 125, 150, 180, 220F, NS125, NS160, NS200 మరియు RS200 వంటి మోడళ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, వీటిలో కొన్ని మోడళ్లను కంపెనీ ప్రస్తుత అవసరాలకు మరియు మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. త్వరలోనే వీటిలో కూడా రిఫ్రెష్డ్ మోడళ్లు కొత్త డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Bajaj auto to discontinue the legendary pulsar 220f model in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X