Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ 'బజాజ్ ఆటో' (Bajaj Auto) దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూ మంచి ఆదరణ పొందుతోంది. బజాజ్ ఆటో ప్రస్తుతం సాధారణ వాహనాలను విక్రయించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విక్రయిస్తూ, ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తోంది.

అయితే కంపెనీ ఇప్పుడు తన ఉనికిని మరియు ఉత్పత్తిని మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు కొత్త ప్లాంట్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

బజాజ్ ఆటో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ద్రుష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పూణెలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించనుంది. దీనికోసం కంపెనీ ఏకంగా రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ ఈ కొత్త ప్లాంట్ కి అకుర్దిలో ఏర్పాటు కానుంది. ఇందులో 2022 నుంచి వాహనాల యొక్క ఉత్పత్తి ప్రారంభం కానుంది.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

బజాజ్ ఆటో సరిగ్గా రెండేళ్ల క్రితం బజాజ్ చేతక్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి డిమాండ్ పొందుతోంది. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఉత్పత్తిని ఎక్కువ సంఖ్యలో చేయకపోవడం వల్ల వినియోగదారులకు అందించలేకపోతోంది.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

ఇది మాత్రమే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ కూడా మళ్ళీ మళ్ళీ నిలిపివేయాల్సి వస్తోంది. అయితే ఇలాంటి వాటికి కంపెనీ స్వస్తి చెప్పడానికి కొత్త ప్లాంట్ లో 2022 నుంచి ఉత్పత్తికి ప్రారంభించనుంది. తద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎక్కవ సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చు, మరియు కస్టమర్లకు సకాలంలో డెలివరీ కూడా చేయవచ్చు.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

కొత్త ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడే ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయి. ఈ కొత్త ప్లాంట్ సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

బజాజ్ ఆటో ప్రారంభించనున్న ఈ కొత్త ఫ్యాక్టరీలో దాదాపు 800 మందికి ఉపాధి లభించే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాంట్ లాజిస్టిక్స్ నుండి మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫ్యాబ్రికేషన్ మరియు పెయింటింగ్, అసెంబ్లీ మరియు నాణ్యత హామీ వరకు రోబోటిక్ మరియు ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా సౌకర్యవంతమైన ఉత్పత్తుల కోసం రూపొందించబడ్డాయి.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

బజాజ్ ఆటో యొక్క ఈ కొత్త ప్లాంట్ కి మరో రూ. 250 కోట్లను విక్రేతలు పెట్టుబడి పెడతారు. ఈ కొత్త ఫ్యాక్టరీ బజాజ్ ఆటో యొక్క R&D కేంద్రంతో అనుబంధించబడింది. కంపెనీ యొక్క ఈ కొత్త ఫ్యాక్టరీని ఎలక్ట్రిక్ వాహనాల డిజైన్, డెవలప్‌మెంట్ మరియు తయారీకి హబ్‌గా మార్చడానికి అనుకూలంగా ఉంటుంది.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎండీ 'రాజీవ్ బజాజ్' మాట్లాడుతూ.. బజాజ్ 2.0 ని 2001 లో పల్సర్‌తో ప్రారంభించామని, ఇప్పుడు చేతక్‌తో 2021 బజాజ్ 3.0 ని విడుదల చేస్తున్నామని తెలిపారు, అంతే కాకూండా రానున్న కాలంలో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆవైపుగా అడుగులు వేస్తామని కూడా ఆయన తెలిపారు.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

బజాజ్ ఆటో అనేక కొత్త నగరాల్లో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌ను ప్రారంభిస్తోంది. కంపెనీ ఇటీవల కాలంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొత్త నగరాలైన చెన్నై మరియు హైదరాబాద్‌లో కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ రెండు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ కోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

కంపెనీ ఇప్పటికే పూణే, నాగ్‌పూర్, బెంగళూరు, ఔరంగాబాద్, మైసూర్ మరియు మంగళూరులో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఈ నగరాల్లో బజాజ్ చేతక్‌ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్ సందర్శించి బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలోని కొనుగోలుదారులకు ఈ డీలర్‌షిప్ లు చాలా అనుకూలంగా ఉంటాయి.

Bajaj Auto కొత్త ప్లాంట్.. ఇక ఉత్పత్తి మరింత వేగవంతం

దీన్ని బట్టి చూస్తే బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి పూర్తి స్థాయిలో ప్రవేశించాలనే నిబద్ధతను కలిగి ఉన్నట్లు మాకు స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో కేవలం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తోంది, కానీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలను ఉత్పత్తి చేసి విక్రయించే అవకాశం కూడా ఉంది.

Most Read Articles

English summary
Bajaj auto to set up a new electric vehicle plant details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X