బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

ప్రముఖ భారతదేశపు టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో, తమ ఐకానిక్ చేతక్ బ్రాండ్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో గతేడాది మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఈ కంపెనీ ఇప్పుడు తమ రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

బజాజ్ ఆటో తాజాగా 'ఫ్రీరైడర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. ట్రేడ్‌మార్క్ ఫైలింగ్‌లో ఈ పేరును క్లాస్ 12 క్రింద రిజిస్టర్ చేశారు మరియ ఈ పేరు యొక్క వివరాల్లో ఎలక్ట్రిక్ టూవీలర్ అని కూడా ప్రస్థావించారు. వీటిని బట్టి చూస్తుంటే, బజాజ్ నుండి రాబోయేది ఖచ్చితంగా ఎలక్ట్రిక్ టూవీలర్ అని తెలుస్తోంది.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

బజాజ్ అనుబంధ టూవీలర్ కంపెనీ కెటిఎమ్ ఇప్పటికే ఫ్రీరైడ్ ఈ-ఎక్స్‌సి అనే తేలికపాటి ఇ-బైక్‌ను కలిగి ఉన్నందున, ఫ్రీరైడర్ బజాజ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బజాజ్ యొక్క మరొక అనుబంధ టూవీలర్ కంపెనీ హస్క్వార్ణ అందిస్తున్న ఇ-పిలెన్ మాదిరిగానే బజాజ్ ఫ్రీరైడర్ కూడా అదే ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే అవకాశం ఉంది.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

ఈ నేపథ్యంలో, హస్క్వార్నా ఇ-పిలెన్ మరియు బజాజ్ ఫ్రీరైడర్ రెండు మోడళ్లలో ఫ్రేమ్, సస్పెన్షన్ సిస్టమ్ మరియు బ్రేకింగ్ సిస్టమ్ వంటి అనేక భాగాలు ఒకే విధంగా ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో హస్క్వార్నా ఇ-పిలెన్ కాన్సెప్ట్ ఆవిష్కరించబడింది మరియు ఇది ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

హస్క్వార్నా ఈ-పిలెన్‌ను ఈ సంవత్సరం చివరిలో లేదా 2022 ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇ-పిలెన్ కాన్సెప్ట్ యొక్క అనేక ఫీచర్లు స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ మోడళ్లతో పంచుకుంటుంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్, వైడ్ హ్యాండిల్ బార్, బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఎక్స్‌పోజ్డ్ ట్రేల్లిస్ ఫ్రేమ్ మొదలైనవి ఉన్నాయి.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

ఇక బజాజ్ ఫ్రీరైడర్ విషయానికి వస్తే, డిజైన్ పరంగా ఇది ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి, దీనిపై వ్యాఖ్యానించడం సరైనది కాదు. కాకపోతే, ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ నియో-రెట్రో డిజైన్ థీమ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

ప్రస్తుతం ఈ డిజైన్ ట్రెండిగ్‌లో ఉంది మరియు యువకులు ఎక్కువగా ఈ డిజైన్‌ను ఇష్టపడుతున్నారు. బజాజ్ ఫ్రీరైడర్ షార్ప్ మరియు స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ మరియు డెకాల్స్‌తో ఇది కంటికి చాలా ఇంపైన రూపంలో ఉంటుందని అంచనా.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

బజాజ్ ఫ్రీరైడర్ కూడా హస్క్వార్నా ఇ-పిలెన్ కాన్సెప్ట్ మాదిరిగానే ఒకే రకమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. ఇ-పిలెన్‌లో 8 కిలోవాట్ల (10.73 బిహెచ్‌పి) ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని పవర్, టార్క్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇది సుమారు 100 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

బ్యాటరీ రేంజ్ సమస్యను దృష్టిలో ఉంచుకొని, హస్క్వార్నా ఇ-పిలెన్‌లో మార్పిడి చేయగల బ్యాటరీలను అమర్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

బజాజ్ ఫ్రీరైడర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఊహించిన దానికంటే త్వరగానే మార్కెట్లను తాకే అవకాశం ఉంది. బజాజ్ ప్రస్తుతం కెటిఎమ్‌తో కలిసి ఓ సాధారణ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది 3 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ల రేంజ్‌లో బహుళ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం 48వి ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నాయి.

బజాజ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్, పేరు 'ఫ్రీరైడర్' !?

ఇదిలా ఉంటే, కెటిఎమ్ మరియు హస్క్వార్నా బ్రాండ్లు కూడా ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నాయి. ఇవి బజాజ్ చేతక్ యొక్క ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటాయని సమాచారం. బజాజ్ చేతక్ మాదిరిగానే బజాజ్ ఫ్రీరైడర్ కూడా ప్రీమియం లైఫ్ స్టైల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Bajaj Auto Trademarks Freerider Name It Might Be A New Electric Motorcycle, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X