బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'చేతక్' ఇప్పుడు బెంగుళూరు మరియు పూనే మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. ఈ రెండు నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

ఆసక్తిగల కస్టమర్లు రూ.2,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు. జూలై 22 నుండి బజాజ్ ఆటో మైసూర్, మంగళూరు మరియు ఔరంగాబాద్ నగరాల్లో కూడా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ ప్రారంభించింన సంగతి తెలిసినదే. గత వారం నాగ్‌పూర్‌లో కూడా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేశారు.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

బజాజ్ ఆటో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హైదరాబాద్ మార్కెట్లో కూడా తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది నాటికి కొత్తగా మరో 22 కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.42 లక్షలు మరియు రూ.1.44 లక్షలకు (ఎక్స్-షోరూమ్)గా ఉ్ననాయి.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.8 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ ఆన్-బోర్డ్ ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ ప్యాక్‌ను తొలగించడానికి వీలుగా ఉండదు, ఇది నిర్ధిష్ట స్థానంలో అమర్చబడి ఉంటుంది. ఈ విభాగంలో బజాజ్ చేతక్‌కు పోటీగా ఉన్న టీవీఎస్ ఐ-క్యూబ్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా తొలగించగల బ్యాటరీ ఆప్షన్ లేదు.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

రేంజ్ విషయానికి వస్తే, పూర్తి చార్జ్‌పై బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ (ఎకో మోడ్‌లో)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఇది రెట్రో-మోడ్రన్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో లైవ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. దీని సహాయంతో స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

అంతేకాకుండా, ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణేలోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.

బెంగుళూరు, పూనే నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్

చేతక్ స్కూటర్ యొక్క సామర్థ్యాన్ని మరియు విశ్వసనీయతను నిరూపించడానికి బజాజ్ 'చేతక్ ఎలక్ట్రిక్ యాత్ర' ప్రచారాన్ని కూడా కంపెనీ చేపట్టింది. ఈ ప్రచారంలో భాగంగా, 10 నగరాల గుండా చేతక్ స్కూటర్ ప్రయాణించి 3,500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter Now Available In Pune And Bangalore; Bookings Open. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X