హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Bajaj Auto తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ Bajaj Chetak EV కోసం కంపెనీ బుకింగ్‌ లను తిరిగి ప్రారంభించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చెన్నై మరియు హైదరాబాద్ వంటి కొత్త నగరాల్లో కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ రెండు నగరాల్లో బుకింగ్స్ రీఓపెన్ అయ్యాయి.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

కాగా, Bajaj Auto ఇప్పటికే తమ Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ ను పూణే, నాగ్‌పూర్, బెంగళూరు, ఔరంగాబాద్, మైసూర్ మరియు మంగళూరు నగరాల్లో విక్రయిస్తోంది. ఈ నగరాల్లో Bajaj Chetak ఈవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు దానిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్ నుండి బుక్ చేసుకోవచ్చు.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవడానికి, కస్టమర్‌లు తమ మొబైల్ నంబర్‌ అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు మొబైల్ నెంబరుకు ఒక OTP ని పంపించడం జరుగుతుంది. ఈ ఓటిపి ద్వారా కస్టమర్లు తమ బుకింగ్‌ ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఇలా బుకింగ్ ధృవీకరించబడిన తర్వాత, కస్టమర్ తనకు నచ్చిన స్కూటర్ యొక్క నగరం, డీలర్, వేరియంట్ మరియు కలర్ ఆప్షన్స్ వంటి వివరాలను ఎంచుకోవచ్చు.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

వెబ్‌సైట్ లో ఈ వివరాలను పొందుపరచిన తర్వాత, Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వివరణాత్మక ధరకు సంబంధించిన వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 2,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కాకపోతే, అధిక డిమాండ్ కారణంగా కంపెనీ ఈ బుకింగ్స్ ను పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంచింది.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ఇక Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, కంపెనీ ఈ స్కూటర్ ను మార్కెట్‌ లో అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. మార్కెట్లో ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ ధర రూ. 1.42 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే) గా ఉన్నాయి.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

Bajaj Chetak ఎలక్ట్రానిక్స్, స్పెసిఫికేషన్‌లు..

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను తొలగించడానికి వీలు లేదు (రిమూవబల్ బ్యాటరీ కాదు).

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఎకో మోడ్‌ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌ లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఇందులోని బ్యాటరీలను 1 గంట పాటు చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ బ్యాటరీని 5 amp పవర్ సాకెట్ తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

Bajaj Chetak డిజైన్ మరియు ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఐకానిక్ బ్రాండ్ రెట్రో మోడ్రన్ లుక్ తో ఉంటుంది. ముందు వైపు నుండి మోడ్రన్ స్కూటర్ లా మరియు సైడ్ నుండి రెట్రో క్లాసిక్ చేతక్ స్కూటర్ లా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ ఉంటాయి.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మరియు లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కంపెనీ పూణేలోని ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. యాప్ స్టోర్ లో అందుబాటులో ఉండే మొబైల్ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు తమ ఫోన్ ద్వారా ఈ స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ కావచ్చు మరియు దానిని లైవ్ ట్రాక్ చేయవచ్చు.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

హైదరాబాద్, చెన్నై నగరాల్లో Bajaj Chetak ఈవీ బుకింగ్స్ రీఓపెన్

Bajaj Chetak పోటీ

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్, TVS iQube, Ather 450X, Ola S1మరియు Simple 1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Bajaj chetak ev bookings re opened in chennai and hyderabad details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X