చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో, గడచిన సంవత్సరం ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' బుకింగ్‌లను కంపెనీ గత కొంత కాలంగా నిలిపివేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ కోసం బుకింగ్‌లను ఏప్రిల్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

ఏప్రిల్ 13, 2021వ తేదీ నుండి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ మోడల్ కోసం బజాజ్ ఆటో కేవలం రిజిస్ట్రేషన్లను మాత్రమే స్వీకరించేది. గతేడాది నుండి ఇప్పటి వరకూ ఈ స్కూటర్ కోసం సుమారు 50,000కి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు సమాచారం.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

జనవరి 2020లో బజాజ్ ఆటో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభంలో ఈ మోడల్‌ను పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత దీనిని దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేయాలన్ని కంపెనీ ప్లాన్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసింది.

MOST READ:ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్‌కు జరిమానా; పూర్తి వివరాలు

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

కోవిడ్-19 మహమ్మారి కారణంగా బజాజ్ ఆటో తమ చేతక్ స్కూటర్ విస్తరణ ప్రణాళికను వాయిదా వేసుకుంది. అంతేకాకుండా, ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. రానున్న రోజుల్లో దేశంలో కొత్తగా 28 నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

గడచిన మార్చి 2021లో బజాజ్ ఆటో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచింది. ఈ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన అర్బన్ ధరను రూ.15,000 మేర పెంచగా, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ప్రీమియం ధరను రూ.5,000 మేర పెంచారు.

MOST READ:మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

తాజా ధరల పెంపు తర్వాత బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ రూ.1.15 లక్షలు కాగా, చేతక్ ప్రీమియం వరియంట్ ధర రూ.1.20 లక్షలకు పెరిగింది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్). తాజా ధరల పెంపుకు ముందు ఈ రెండు వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.1 లక్ష మరియు రూ.1.15 లక్షలుగా ఉండేవి.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

ప్రస్తుతం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంపిక చేసిన నగరాల్లో బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఐకానిక్ చేతక్ నేమ్‌ప్లేట్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు త్వరలో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

ఈ స్కూటర్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

MOST READ:సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ రీఓపెన్ చేసిన బజాజ్ ఆటో

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది చూడటానికి రెట్రో-మోడ్రన్ స్టైల్ స్కూటర్‌లా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Chetak EV Bookings To Reopen From 13th April, 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X