హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

ప్రముఖ దేశీయ టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో అందిస్తున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ త్వరలోనే హైదరాబాద్ మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూనే మరియు బెంగుళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

మరికొద్ది రోజుల్లోనే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చెన్నై మరియు హైదరాబాద్ మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. బజాజ్ ఆటో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 2020లో తొలిసారిగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ కోసం బుకింగ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 2,000 యూనిట్ల మార్కును చేరుకుంది.

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తు దేశంలోకి కరోనా వైరస్ వ్యాపించడంతో ఈ స్కూటర్ ఉత్పత్తి మరియు అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగించే కొన్ని విడిభాగాలను కంపెనీ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కోవిడ్-19 కారణంగా సప్లయ్ చైన్ దెబ్బతినడంతో ఈ స్కూటర్ ఉత్పత్తి మరింత ఆలస్యమైంది.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ ఇప్పుడు కస్టమర్ల నుండి కేవలం రిజిస్ట్రేషన్లను మాత్రమే స్వీకరిస్తోంది. గతేడాది నుండి ఇప్పటి వరకూ ఈ స్కూటర్ కోసం సుమారు 50,000కి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకూ కంపెనీ 1,400 యూనిట్లకు పైగా స్కూటర్లను డెలివరీ చేసింది.

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

బజాజ్ ఆటో ప్రస్తుతం ఈ స్కూటర్ పూణే మరియు బెంగళూరు నగరాల్లోని 13 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తోంది. త్వరలోనే ఈ స్కూటర్‌ను చెన్నై, హైదరాబాద్ నగరాలతో పాటుగా దేశంలోని మరిన్ని ఇతర ప్రధాన నగరాల్లో కూడా విడుదల చేయాలన్ని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

బజాజ్ చేతక్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఇటీవలే ఈ స్కూటర్ ధరను భారీగా రూ.27,000 మేర పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.42 లక్షలు (అర్బన్) మరియు రూ.1.47 లక్షలు (ప్రీమియం)గా ఉన్నాయి.

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

గడచిన మార్చి 2021లో కూడా బజాజ్ ఆటో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచింది. గతంలో బేస్ వేరియంట్ అయిన అర్బన్ ధరను రూ.15,000 మేర పెంచగా, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ప్రీమియం ధరను రూ.5,000 మేర పెంచారు. ఇదివరకు ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.15 లక్షలు (అర్బన్), రూ.1.20 లక్షలు (ప్రీమియం)గా ఉండేవి.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులో 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

ఈ రెట్రో-మోడ్రన్ స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

MOST READ:భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు త్వరలో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter To Be Launched In Chennai And Hyderabad Very Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X