మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'చేతక్ ఈవీ'ని కంపెనీ ఇప్పుడు కొత్తగా మరో మూడు నగరాల్లో విడుదల చేయబోతోంది. మైసూర్, మంగళూరు మరియు ఔరంగాబాద్‌లలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

ఈ నేపథ్యంలో, మైసూర్, మంగళూరు మరియు ఔరంగాబాద్ నగరాల్లో జూలై 22 నుంచి ఈ స్కూటర్ కోసం బుకింగ్‌లను ప్రారంభింస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు రూ.2,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

బజాజ్ ఆటో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హైదరాబాద్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. కాగా, గతవారం ఈ స్కూటర్‌ను నాగ్‌పూర్‌లో మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు, కొత్తగా మైసూర్, మంగళూరు మరియు ఔరంగాబాద్ నగరాల్లో విడుదల చేసింది.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

ఏడాది కొత్తగా మరో 22 కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మడం ప్రారంభిస్తామని బజాజ్ ఆటో పేర్కొంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.42 లక్షలు మరియు రూ.1.44 లక్షలకు (ఎక్స్-షోరూమ్)గా ఉ్ననాయి.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

బజాజ్ ఆటో అందిస్తున్న ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.8 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

ఇందులోని బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ ప్లేస్‌లో ఉంటుంది, తొలగించడానికి వీలుగా ఉండదు. ఈ విభాగంలో బజాజ్ చేతక్‌కు పోటీగా ఉన్న టీవీఎస్ ఐ-క్యూబ్ మరియు ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా తొలగించగల బ్యాటరీ ఆప్షన్ లేదు.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ (ఎకో మోడ్‌లో)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఇది రెట్రో-మోడ్రన్ స్టైల్‌ను కలిగి ఉంటుంది.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు. ఇందులోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి 5 గంటల సమయం పడుతుంది.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో లైవ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. దీని సహాయంతో స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

రద్దీగా ఉండే ప్రదేశంలో స్కూటర్ పార్క్ చేసినప్పుడు, దానిని సులువుగా గుర్తించేందుకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతక్ స్కూటర్ జనరల్ సర్వీస్ 15,000 కిలోమీటర్ల వద్ద జరుగుతుంది, ఇది పెట్రోల్ శక్తితో నడిచే స్కూటర్లతో పోలిస్తే చాలా ఎక్కువ.

మరో మూడు కొత్త నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్!

చేతక్ స్కూటర్‌ను పూణేలోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. చేతక్ స్కూటర్ యొక్క సామర్థ్యాన్ని మరియు విశ్వసనీయతను నిరూపించడానికి బజాజ్ 'చేతక్ ఎలక్ట్రిక్ యాత్ర' ప్రచారాన్ని కూడా కంపెనీ చేపట్టింది. ఈ ప్రచారంలో, 10 నగరాల గుండా చేతక్ స్కూటర్ ప్రయాణించి 3,500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.

Article Published On: Thursday, July 22, 2021, 12:53 [IST]
English summary
Bajaj Chetak Now Available In Mysore, Mangalore And Aurangabad; Booking Open. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+