పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

దేశంలో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.100 దాటిపోయి, రూ.110కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

కస్టమర్ల వద్ద ఇప్పటికే పెట్రోల్‌తో నడిచే టూవీలర్ ఉంటే దాని ఎక్సేంజ్ చేసి మరీ ఎలక్ట్రిక్ టూవీలర్లను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరైతే, పెట్రోల్‌తో నడిచే టూవీలర్లను ఇంట్లో రెండవ వాహనం ఉంచుకొని, మొదటి వాహనం రోజూవారీ ఉపయోగం కోసం ఎలక్ట్రిక్ టూవీలర్లను కొనుగోలు చేస్తున్నారు.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు పెట్రోల్ టూవీలర్ల అమ్మకాలను ఓవర్‌టేక్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గడచిన జూన్ నెలలో బజాజ్ ఆటో 452 యూనిట్ల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగా, టీవీఎస్ 639 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

ప్రస్తుతం మార్కెట్లో ఏథర్ ఎనర్జీ, ఆంపియర్ వంటి అనేక ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, బజాజ్ మరియు టీవీఎస్ బ్రాండ్లపై కస్టమర్లు అధిక విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. నిజానికి ఈ రెండు బ్రాండ్లు విక్రయించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం పరిమిత మార్కెట్లలో మాత్రమే లభిస్తున్నాయి.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

రానున్న రోజుల్లో వీటిని దేశంలోని మరిన్ని మార్కెట్లకు విస్తరించాలని ఇరు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. అదే గనుక జరిగితే, బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కూడా భారీ ప్లాన్స్‌తో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించింది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు అనుగుణంగా, సరైన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు కూడా ఇటు ఆటోమొబైల్ కంపెనీలు మరియు అటు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే దిశగా పనులు జరుగుతున్నాయి.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 3.8 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ (ఎకో మోడ్‌లో) చేస్తుందని కంపెనీ పేర్కొంది. గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఇది రెట్రో-మోడ్రన్ స్టైల్‌లో కనిపిస్తుంది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 3 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇది కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. అందుకే ఆ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టైయిల్ లైట్స్, పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను జత చేయడానికి బ్రాండ్ యొక్క స్మార్ట్ కనెక్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Bajaj Chetak, TVS iQube EV Sales Increased Due To Rising Fuel Prices, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X