Just In
- 34 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- 16 hrs ago
షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?
Don't Miss
- News
గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా .. టచ్ చేసి చూడు .. కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెరిగిన బజాజ్ డొమినార్ బైక్స్ ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న డొమినార్ 250 మరియు డొమినార్ 400 మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి వీటి ధరలు రూ.2,000 మేర పెరిగాయి.

బజాజ్ డొమినార్ 250 మోటార్‌సైకిల్ ధర రూ.2003 పెరిగి రూ.1.65 లక్షల నుండి రూ.1.67 లక్షలకు చేరుకుంది. ఇకపోతే బజాజ్ డొమినార్ 400 మోటార్‌సైకిల్ ధర రూ.1997 పెరిగి రూ.1.97 లక్షల నుండి రూ.1.99 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

బజాజ్ ఆటో తమ డొమినార్ మోడళ్ల ధరలను పెంచడం ఇదేం మొదటిసారి కాదు. గత 2019లో బజాజ్ డొమినార్ బిఎస్6 వెర్షన్ మోటార్‌సైకిళ్లు మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ వీటి ధరలు సుమారు రూ.27,000 వరకూ పెరిగాయి.
MOST READ: సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

బజాజ్ డొమినార్ 250 మోటార్‌సైకిల్‌లో 248సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్పి పవర్‌ను మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇక డొమినార్ 400 విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌లో 373సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 39.4 బిహెచ్పి పవర్‌ను మరియు 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ: షాకింగ్ న్యూస్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిస్కంటిన్యూ, వైబ్‌సైట్ నుండి మాయం!

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ప్రధానంగా ఇంజన్లలో మార్పు మినహా మిగిలిన మెకానికల్ హార్డ్‌వేర్ మరియు డిజైన్‌లోని చాలా అంశాలు ఒకేలా ఉంటాయి. ఇందులో ఆల్ ఎల్ఈడి లైటింగ్, ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-బారెల్ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 13-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, సెకండరీ డిస్ప్లే, స్ప్లిట్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Models | New Price | Old Price | Premium |
Dominar 400 | ₹1,99,755 | ₹1,97,758 | ₹1,997 |
Dominar 250 | ₹1,67,718 | ₹1,65,715 | ₹2,003 |

బజాజ్ డొమినార్ 400 మోటార్‌సైకిల్‌తో పోటీపడే కెటిఎమ్ డ్యూక్ 390 ధర రూ.2.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ రెండు మోడళ్ల మధ్య దాదాపు రూ.70,000 ధరల వ్యత్యాసం ఉంది.
MOST READ: ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

అలాగే, బజాజ్ డొమినార్ 250 మోటార్‌సైకిల్‌తో పోటీపడే కెటిఎమ్ డ్యూక్ 250 మోడల ధర రూ.2.17, లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ రెండు మోడళ్ల మధ్య దాదాపు రూ.50,000 ధరల వ్యత్యాసం ఉంది.

బజాజ్ ఆటో కేవలం డొమినార్ బైక్స్ ధరలనే కాకుండా, మొత్తం తమ మోటారుసైకిల్ లైనప్‌లోని అన్ని మోడళ్ల ధరలను కూడా పెంచింది. జనవరి 2021లో తయారు చేయబడి మరియు విక్రయించబడే అన్ని మోటార్‌సైకిళ్లకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.